మసాలా
 
 
 
 
ఓ ఫైన్ డే నేనే చెప్పేశా
మెగాస్టార్ తనయుడు రామ్‌చరణ్‌తేజ మనసు విప్పి మాట్లాడారు. అపోలో ఆస్పత్రి చైర్మన్ప్రతాప్ సి.రెడ్డి మనువరాలు ఉపాసనతో పెళ్లి ఫిక్సయిన తరువాత తొలిసారిగా రామ్‌చరణ్‌తేజ మీడియాముందుకు వచ్చారు. ఆయన మనసు విప్పి మాట్లాడారు. తన మనసు కొల్లగొట్టిన ఉపాసనతో పరిచయం... అది పరిణయానికి దారితీసిన తీపి ‘సం’గతులను చెప్పారు.

బెస్ట్ ఫ్రెండ్: ఉపాసన నాకు మంచి స్నేహితురాలు. సాఫ్ట్ గర్ల్. ఆమెకు నా గురించి అన్నీ తెలుసు. ఆరేళ్ల మా పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరం పెళ్లి చేసుకొంటున్నందుకు ఎంతో హ్యాపీగా ఉంది.

సరదా సరదాగా: మేం ఎప్పుడు కలిసినా జోక్స్ వేసుకుంటూ జాలీగా గడుపుతాం. ఎక్కువగా తనే మాట్లాడుతుంది. ఆమె మాటల్లో ఎంతో నిజాయితీ. నా సినిమాలన్నా మహా ఇష్టం.

ప్రకృతిపై ప్రేమ: ఉపాసనకు ప్రకృతిపై మక్కువ ఎక్కువ. జంతువులను ప్రేమిస్తుంది. బుక్స్ కలెక్ట్ చేసి లేనివారికి ఇస్తుంది. ఈ అభిరుచులు మా మనసులను దగ్గర చేశాయి. ఆమె అడుగుజాడల్లో నేను కూడా పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని నిర్ణయించుకున్నా.

పర్‌ఫెక్ట్ మ్యాచ్: మా ఇద్దరిదీ పర్‌ఫెక్ట్ మ్యాచ్ అని రెండు కుటుంబాలు నిర్ణయించిన తరువాతనే మూడుముళ్ల బంథానికి గ్రీన్ సిగ్నల్ పడింది. ఇక పెళ్లి విషయాలన్నీ మా పెద్దలకే వదిలేశాం. ఎంగేజ్‌మెంట్ కోసం వచ్చే నెలలో షాపింగ్ చేస్తా.

నవంబర్‌లో నిశ్చితార్ధం!: నవంబర్ చివరి లేదంటే డిసెంబర్ మొదటివారంలో మా నిశ్చితార్థం ఉంటుంది. పెళ్లి తేదీ ఇంకా ఖరారు కాలేదు. అయితే కొత్త పంచాంగాలు వచ్చిన తరువాతే ముహూర్తం ఉండొచ్చు.

అపోలో ఫ్యామిలీ: అపోలో ఫ్యామిలీలో నేనూ సభ్యుడినయినందుకు ఆనందంగా ఉంది. చిన్నప్పటి నుంచి నాకు ప్రతాప్‌రెడ్డి ఫ్యామిలీతో అనుబంధం. మా రెండు కుటుంబాల మధ్య ఎప్పటి నుంచో మంచి స్నేహం ఉంది.

మొదట ప్రపోజ్ చేసింది: ఇద్దరికీ ఒకరిపై ఒకరికి చెప్పలేనంత ప్రేమ. కానీ చాలాకాలం అది మనసులు దాటలేదు. ప్రపోజ్ చేయడంలో ఇద్దరిదీ తడబాటే. ఇక లాభం లేదని... ఓ ఫైన్ డే నేనే చెప్పేశా. ఉపాసన కళ్లు ఆనందంతో చెమర్చాయి. వెంటనే ఓకే అనేసింది.