చాక్లెట్ బాయ్ రణబీర్‌కపూర్, హాట్ గాళ్ నర్గిస్ ఫక్రి మధ్య ‘ఏ మాయ చేశావె’లాంటి ప్రేమకథ నడుస్తోంది. ఆ సినిమాలో నాగచైతన్య
కంటే సమంత రెండేళ్లు పెద్ద. ఇక్కడేమో రణబీర్ కంటే నర్గిస్ మూడేళ్లు పెద్ద. అయినా ఫర్వాలేదు. ప్రేమకు వయసుతో పని
లేదనుకున్నారో ఏమో ఇద్దరూ పూర్తిగా ప్రేమలో మునిగిపోయారు. త్వరలో విడుదల కానున్న ‘రాక్‌స్టార్’ చిత్రంలో రణబీర్, నర్గిస్
జంటగా నటించారు. ఈ షూటింగ్ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందన్నది బాలీవుడ్ టాక్. ఆ ప్రేమతోనే ఇటీవల నర్గిస్
పుట్టిరోజుని రణబీర్ చాలా వైభవంగా జరిపాడు.
భూమి మీద కాదు.. ఏకంగా గగన విహారం చేస్తూ పుట్టినరోజు వేడుక జరిపి, ప్రియురాలిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు రణబీర్. అసలు
విషయంలోకి వస్తే.. ‘రాక్‌స్టార్’ ప్రమోషన్ కోసం ఇటీవల ఈ యూనిట్ సభ్యులు నాగ్‌పూర్ వెళ్లారు. మొత్తం అందరూ ఒకే ఫ్లయిట్‌లో
ప్రయాణం చేశారు. ఆరోజు నర్గిస్ బర్త్‌డే కావడంతో ఆమెకు తెలియకుండా విమానంలోనే ఓ పార్టీ ఏర్పాటు చేశాడట రణబీర్.
ముంబయిలోని ఓ ప్రముఖ బేకరీలో కేక్ తయారు చేయించాడట రణబీర్.
విమానం ఇరవై వేల అడుగుల ఎత్తుకి వెళ్లిన తర్వాత నర్గిస్ అసిస్టెంట్ ఆమెను క్యాబిన్ నుంచి బయటికి తీసుకెళ్లిందట. ఐదు నిమిషాల
తర్వాత క్యాబిన్‌కి తిరిగొచ్చిన నర్గిస్ అక్కడి అలంకరణ చూసి ఆశ్చర్యపోయిందట. ఆ ఆశ్చర్యం నుంచి తేరుకునే లోపు ‘హ్యాపీ బర్త్‌డే టు
యూ’ అంటూ యూనిట్ సభ్యులు పాడటం ఆమెను మరింత థ్రిల్‌కి గురి చేసిందని సమాచారం. తను పుట్టిన తర్వాత ఇలాంటి బర్త్‌డే
జరుపుకోలేదని, ఆకాశంలో బర్త్‌డే జరుపుకోవడం ఓ కొత్త అనుభవం అని ఆనంద భాష్పాల మధ్య నర్గిస్ కేక్ కట్ చేసిందట. 20 వేల
అడుగుల ఎత్తులో బర్త్‌డే చేసిన రణబీర్ ప్రియురాలికి మనసులో ఏ రేంజ్ స్థానం ఇచ్చాడో ఊహించొచ్చును.