అందాల మడోన్నా..క్యూట్ బ్రిట్నీని ముద్దాడినా, ఇద్దరు లెస్బియన్‌లు పబ్లిగ్గా రొమాన్స్
చేసినా..అది హాలీవుడ్‌కే చెల్లింది! అంతకు మించిన సంచలనం తాజాగా బాలీవుడ్
మెరుపుతీగల నడుమ చోటుచేసుకోవడం విశేషం. ఓ ఇమ్రాన్‌హస్మి, మరో రణబీర్ కపూర్
తమ నాయికలను ఏ స్థాయిలో చుంబిస్తారో..అంతకు ఏమాత్రం తగ్గని రీతిలో ఘాటైన లిప్ టు
లిప్ ముద్దులతో సందడి చేశారు ఇద్దరు బాలీవుడ్ భామామణులు. ఎవరా భామలు అని
తరచి చూస్తే ‘నో ఒన్ కిల్డ్ జెస్సికా’ చిత్రంలో నటించిన విద్యాబాలన్, రాణీముఖర్జీ. తమ
సినిమా ప్రచారాన్ని ఈ ముద్దుగుమ్మలిద్దరూ సరికొత్త రీతిలో హోరెత్తిస్తున్నారు. అందులో
భాగంగానే ఒకరినొకరు గాఢంగా హత్తుకుని ఒకరినొకరు చుంబించుకోవడం తాజాగా సంచలనం
సృష్టించింది. లక్షలాది కళ్లు తమనే వీక్షిస్తుండగా ఈ ఇద్దరూ ఒకరినొకరు ముద్దులాడుకోవడం
పాశ్చాత్యధోరణికి పరాకాష్ఠ అని, బోల్డ్ రోల్స్ పోషించే ఈ ఇద్దరికీ ఇదేమీ అంత కొత్త విషయమే
కాదనే టాక్ కూడా పరిశ్రమలో నడుస్తోంది.
|