మసాలా
 
 
 
 
ఐశ్వర్య చిత్రంలో శ్రుతి మించిన రొమాన్స్
ధనుష్, శృతిహాసన్‌ల రొమాన్స్ దృశ్యాల పోస్టర్లు సంచలనం కలిగిస్తున్నాయి. ధనుష్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘3’. ఇందులో కమలహాసన్ కూతురు శృతిహాసన్ హీరోయిన్. ఈ చిత్రం ద్వారా ధనుష్ భార్య ఐశ్వర్య తొలిసారిగా మెగా ఫోన్ పట్టారు. దీన్ని ఆర్‌కే ప్రొడక్షన్స్ పతాకంపై ధనుష్ తండ్రి, దర్శకుడు కస్తూరి రాజ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ప్రచురించిన పోస్టర్లలో ధనుష్, శృతిహాసన్‌ల రొమాన్సింగ్ ఫోటోలు సంచలనం కలి గిస్తున్నాయి. చిత్రంలో లిప్‌లాక్ సన్నివేశాలు కూడా చోటుచేసుకుంటాయని సమాచారం. దీని గురించి చిత్ర దర్శకురాలు ఐశ్వర్యను అడగ్గా ‘3’ ఇలాంటి విషయాలు ఇవాళ, రేపు సర్వసాధారణం అని అన్నారు. సినిమాను కోట్లాదిమంది వీక్షిస్తారన్న విషయం తెలియనిది కాదన్నారు. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే ‘3’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు ఐశ్వర్య తెలిపారు.