Bookmark and Share   Cinevinodam
Subscribe
 
 
సినిమా బిజినెస్లోకి సైఫ్- కరీనా

     మేం ప్రేమించుకొన్నాం.. అని ధైర్యంగా ముందుకొచ్చి చెప్పే జంటల్లో ఒకటి సైఫ్‌ అలీఖాన్‌-కరీనాకపూర్‌. చేతిపై తన ప్రియురాలి పేరును పచ్చబొట్టుతో రాసుకొని మరీ బయటకొచ్చాడు సైఫ్‌. మా పెళ్లికి ఇంకా టైమ్‌ ఉందంటూ ప్రేమను పెళ్లిదాకా తీసుకెళ్లింది కరీనా. అధికారికంగా జీవిత భాగస్వాములు ఎప్పుడవుతారో ఏమో కానీ.. త్వరలో వ్యాపారంలో మాత్రం భాగస్వాములు అవుతున్నారు. నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి భారీస్థాయిలో చిత్రాలను నిర్మించాలన్నది వీరి ఆలోచన. సైఫ్‌ ఇప్పటికే తను నటిస్తున్న 'ఏజెంట్‌ వినోద్‌' చిత్ర నిర్మాణంలో భాగస్వామిగా కొనసాగుతున్నారు. ఆ చిత్ర నిర్మాత దినేష్‌ విజాన్‌తో కలిసి మరిన్ని చిత్రాలు నిర్మించాలనేది ఆయన ఆలోచన. అంతటితో ఆగకుండా మరో నిర్మాణ సంస్థను కూడా ప్రారంభించి ఆ బాధ్యతను కరీనాకు అప్పగించాలని అనుకొంటున్నాడట. ఇటీవలే నలభయ్యో పుట్టిన రోజున జరుపుకొన్న సైఫ్‌ అలీఖాన్‌ తన భవిష్యత్‌ కార్యాచరణ గురించి చెప్పుకొచ్చారు. ''నిర్మాతగా, నటుడుగా ఎదగాలంటే ఇలాంటి నిర్ణయాలు అవసరం. వ్యాపారం చెయ్యాలన్నది చాలా రోజులుగా అనుకొంటున్నా. అయితే నాకు తెలిసిన సినిమా రంగమైతే బాగుంటుందని నిర్ణయించుకొన్నా. అందుకే చిత్ర నిర్మాణంలోకి అడుగుపెట్టా'' అన్నారు. జీవితానికి సంబంధించిన పాఠాలను కరీనా బాగానే బోధిస్తున్నట్టుంది కదూ!

 
 

Copy right reserved for www.cinevinodam.com 2005