మసాలా
 
 
 
 
సెంటిమెంట్ బాగా పండింది

‘బాడీగార్డ్’ చిత్రం నాకు కొత్త ఉత్సాహాన్నిచ్చింది. నా పాత్రలో సెంటిమెంట్ బాగా పండిందని అందరూ ప్రశంసిస్తున్నారు. ఈ సినిమా విజయంతో కొత్త ఏడాది సక్సెస్‌ఫుల్‌గా ప్రారంభమయ్యింది’ అని అనందాన్ని వ్యక్తం చేస్తోంది ముద్దుగుమ్మ సలోని. సోమవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఈ సుందరి మాట్లాడుతూ ‘మూడు భాషల్లో విజయం సాధించిన ఈ చిత్రం తెలుగులో ఎలా వుంటుందోనని థ్రిల్లింగ్‌గా ఎదురుచూశాను. తెలుగులో కూడా పెద్ద విజయాన్ని సాధించడం ఆనందంగా వుంది. వెంక సీనియర్‌తో కలసి నటించడం మరచిపోలేని అనుభూతినిచ్చింది. సినిమాలోని కామెడీ, సెంటిమెంట్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటోంది. వెంక లేడీ గెటప్‌లో చేసిన సన్నివేశాల్ని నేను కూడా బాగా ఎంజాయ్ చేశాను.

ముఖ్యంగా సినిమాలో చివరి అర్ధగంట సెంటిమెంట్‌తో ప్రేక్షకుల్ని కట్టిపడేసింది.చాలా చిత్రాల్లో నేను బబ్లీ గర్ల్ క్యారెక్టర్స్ చేశాను. కానీ ఇందులో నా పాత్ర చాలా సాఫ్ట్‌గా వుంటుంది. ఈ పాత్ర ద్వారా భావోద్వేగాలు బాగా పండించే అవకాశం లభించింది. మా కుటుంబ సభ్యులతో సినిమా చూశాను. సినిమాలో నేను చనిపోయే సన్నివేశాల్ని చూసి ప్రేక్షకులతో పాటు నేను కూడా ఉద్వేగానికి లోనయ్యాను. కెరీర్ ఇలా వుండాలని ప్రత్యేకంగా ఎలాంటి ప్లానింగ్ పెట్టుకోలేదు. గత కొంతకాలంగా తెలుగులో మంచి అవకాశాలు రావడం అదృష్టంగా భావిస్తున్నాను. నా కెరీర్‌లో బాడీగార్డ్ ప్రత్యేక చిత్రంగా నిలిచిపోతుంది’ అని తెలిసింది.