భవిష్యత్తు గురించి ఆలోచించే అలవాటు మనకు లేదు. ఈరోజు ఏమిటని మాత్రమే ఆలోచిస్తా. ముందున్న క్షణాన్ని ఆస్వాదించడం నేర్చుకున్నా. అదే నాకున్న ఏకైక బలం...అంటోంది సమంత. మహేష్‌బాబుతో చేసిన 'దూకుడు' పూర్తికావచ్చింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంటుందని విశ్వాసంతో సమంతా ఉంది. మరిన్ని అవకాశాలకు దారి చూపుతుందని ఆశగా ఉంది. తెలుగులో ప్రేక్షకుల్లో ప్రస్తుతం మంచి క్రేజ్ సంపాదించిన తారల్లో సమంతా ఒకరు. దాంతో కొత్త కొత్త ఎండార్స్‌మెంట్స్‌తో రెండు చేతులా సంపాదిస్తోంది. తనలో మైనస్ పాయింట్స్ కన్నా, ప్లస్ పాయింట్సే ఎక్కువ అంటున్న సమంతా చెబుతున్న సంగతులు...
'ఎన్ని కష్టాలొచ్చినా మొహంపై చిరునవ్వు చెరిగిపోదు. మితిమీరిన కోరికలేమీ నాకు లేవు. ఫలానా సినిమా అవకాశం నాకు రావాలని ఎప్పుడూ ఆలోచించలేదు' అని అంది.
మీ నటనలో ఎవరి ప్రభావం ఎక్కువగా ఉందని అడిగితే...'ఇంకెవరూ...గౌతమ్‌మీనన్. కెమరా ముందు ఎంత సులభంగా నటించొచ్చన్న సంగతి ఆయన్నుంచే తెలుసుకున్నా. నీ నుంచి సహజంగా ఏది వస్తుందో అదే నటన అని గౌతమ్ చెబుతారు. అదే విధానాన్ని ఫాలో అవుతున్నా. చక్కటి ఫలితాన్ని అందుకున్నా'నని చెబుతతోంది. 'నంది పురస్కారం రావటం ఎంతో ఆనందాన్నిచ్చింది. తెలుగులో తొలి చిత్రంతోనే ఇలాంటి పురస్కారాలు అందుకొంటానని కలలో కూడా ఊహించలేద'ని సంతోషాన్ని వ్యక్తం చేసింది.