"హాట్‌గా డ్రెస్ చేసుకుని అంగాంగ ప్రదర్శన చేసే పాత్రలు మాత్రమే కాదు.. నీట్‌గా డ్రెస్‌లు వేసుకుని
నటనకు అవకాశం ఉన్న పాత్రలు వస్తే తప్పకుండా చేస్తా' అని హాట్ గాళ్ ఇమేజ్ తెచ్చుకున్న
సమీరారెడ్డి పలు సందర్భాల్లో అన్నారు. అయితే ఒకరిద్దరు దర్శకులు తప్ప మిగతా దర్శకులు
ఆమెను గ్లామర్ గాళ్‌గా చూపించడానికే ఆసక్తి కనబరుస్తున్నారు. సమీరా కోరుకున్నట్లు తనలో
నటిని వెలికి తీసే అవకాశాన్ని గౌతమ్ మీనన్ ఆమెకు కల్పించారు.
తమిళంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ నిరవధికంగా జరుగుతోంది. చిన్న బడ్జెట్లో, తక్కువ కాలవ్యవధిలో హార్రర్ కథాంశంతో ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఇది లేడీ ఓరియంటెడ్
ఫిల్మ్ కావడంతో కోలీవుడ్‌లో తన కెరీర్‌కు మంచి మలుపు అవుతుందనే నమ్మకాన్ని
వ్యక్తపరుస్తున్నారు సమీరారెడ్డి. ఇది కాకుండా హిందీలో 'రెడ్ అలర్ట్ - ది వార్ వితిన్' అనే హిందీ
చిత్రంలో నటిస్తున్నారామె. ఇందులో ఆమె డీ-గ్లామరైజ్డ్‌గా కనిపిస్తారు. కారణం ఆమె పోషిస్తున్నది
నక్సలైట్ పాత్ర అట.
బిగించిన జుత్తుతో, చేతిలో గన్నుతో, వంటి నిండా డ్రెస్‌తో కరడు గట్టిన నక్సలైట్ ఎలా ఉంటారో..
సమీరా ఈ చిత్రంలో అలానే అగుపిస్తారు. ఈ పాత్ర గురించి చెబుతూ - "మేకప్ లేకుండా చేయడం
చాలా హాయిగా ఉంది. కాకపోతే నేను చాలా సున్నితం. అందుకని టఫ్‌గా కనిపించడం కోసం
కొంచెం కష్టపడాల్సి వస్తోంది. ఈ పాత్రను చాలెంజ్‌గా తీసుకుని చేస్తున్నాను. కచ్చితంగా మంచి
పేరు తెచ్చిపెడుతుందనే నమ్మకం ఉంది' అంటున్నారు సమీరారెడ్డి.
|