Bookmark and Share   Cinevinodam
Subscribe
 
 
సమీరాను ‘బాంబ్ షెల్’ అని పిలవచ్చు

      సినిమాలో నటించాలంటే హీరోయిన్స్‌కి యాక్షనే కాదు.. గ్లామరూ కావాలి. అయినా అందముంటే దాచుకోవటమేందుకు. ఆ అందం గురించి ఎవరైనా కామెంట్‌ చేస్తే సిగ్గు పడటం దేనికి? గ్లామర్‌ డాల్‌ అన్నా... బాంబ్‌షెల్‌ అన్నా... నాకు మాత్రం ఎలాంటి భేషజాలు లేవని ముద్దుగా ఉండే సమీరా రెడ్డి అంటోంది. పంకజ్‌ ఉదాస్‌ తీసిన ఔర్‌ అయిస్థా.. మ్యూజిక్‌ ఆల్బమ్‌తో పాపులర్‌ అయిన... సమీరా రెడ్డి అప్పట్లో తన కొంటె చూపులతో కుర్రకారుని ఫ్లాట్‌ చేసింది . ఆ పాట ఇచ్చిన హిట్‌తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆమె నటిం చిన తొలి సినిమా ‘మైనే దిల్‌ తుజ్‌కో దియా’.

ఇది 2002 సంవత్సరంలో వచ్చింది. అయితే సమీరా గురించి అందరికీ తెలిసింది మాత్రం ముసాఫిర్‌ సినిమాతోనే. ఆ తరవాత టాలీవుడ్‌, కొలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆమెకు టాలీవుడ్‌లో మాత్రం చెప్పుకోదగ్గ హిట్‌ సినిమా మాత్రం ఏదీ లేదు. గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వంలో తమిళంలో విడుదలైన ‘వారణమ్‌ అయిరమ్‌’ ఆమెకు అక్కడ మంచి బ్రేక్‌నిచ్చింది. యూత్‌లో కూడా ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ని తెచ్చిపెట్టింది. దానికి కారణం సమీరా అందాలే. లావుగా ఉండే వాళ్లలంటే తెగ ఇష్టపడే తమిళియన్స్‌కి....సమీరా హైటు వెయిటు ఆమెకి ప్లస్‌ అయ్యాయి. ఈ సినిమా ఇచ్చిన హిట్‌తోనే ఆమెకు మళయాళంలో కూడా ఆఫర్లొచ్చాయి. అక్కడ ఆమె ఓరు నాల్‌ వరుమ్‌, కాసినోవా చిత్రాల్లో నటిస్తోంది. యాక్షన్‌, డాన్స్‌ల్లో మాంచి ఈజ్‌ ఉన్న సమీరాకు ఇప్పటి వరకు బాలీవుడ్‌ మంచి హిట్‌ సినిమా లేదు. అయినా తన అందం, చందం, డాన్స్‌లతో నెట్టుకొచ్చేస్తుంది.

మంచి నటిగా గుర్తింపు పొందాలంటే నటనే కాదు ... అందం కూడా ముఖ్యమంటోంది. గ్లామర్‌ డాల్‌గా..బాంబ్‌షెల్‌గా ఇప్పుడున్న చాలామంది హీరోయిన్లు...వాళ్ల కెరీర్‌ని ముందుగా గ్లామర్‌రోల్స్‌తోనే ప్రారంభించారు. నేను కూడా అటువైపు వెళితే తప్పేంటి అని ఎదురు ప్రశ్నవేస్తుంది. గ్లామర్‌ రోల్స్‌లో యాక్షన్‌ లేదంటే ఒప్పుకోనంటోంది. 30 ఏళ్ల ఈ సుందరి గ్లామర్‌ పాత్రతో పాటూ... బెంగాలీ డైరక్టర్‌ బుద్ధదేవ్‌ దాస్‌గుప్తా తీసిన కాల్‌ పురుష్‌లోనూ నటించింది. రెడ్‌ అలర్డ్‌ సినిమాలోనూ క్షీ పాత్రలో సమీరా అద్భుతంగా యాక్ట్‌ చేసింది.

 
 

Copy right reserved for www.cinevinodam.com 2005