‘కత్తి’తో టాలీవుడ్‌లో అడుగు పెట్టిన అందాల భామ సనాఖాన్... నాగ్‌తో ‘గగనం’లో కూడా
నటిస్తోంది. కొన్ని పాత్రలే చేసినా గుర్తుండిపోయేవి చేయాలని ఆశపడుతోన్న ఈ కత్తిలాంటి పిల్ల
చెబుతున్న కబుర్లు...
- నా యాడ్స్, నేను చేసిన తమిళ చిత్రాలు చూసి ‘కత్తి’ కోసం తీసుకున్నారు. మొదటి
సినిమాయే ఎన్టీఆర్ ఆర్ట్స్ లాంటి పెద్ద బ్యానర్‌లో చేయడం నా అదృష్టం. సాదా సీదా అమ్మాయి
‘అంజలి’ పాత్రను చాలా ఎంజాయ్ చేశాను అని అంటోంది సనాఖాన్.
- ‘కత్తి’ తర్వాత తెలుగులో చాలా అవకాశాలు వచ్చాయి. కానీ అంగీకరించలేదు. కొన్ని
పాత్రలే చేసినా గుర్తుండిపోయేవి చేయాలనుకుంటున్నాను.
- కెరీర్ ప్రారంభంలోనే, అది కూడా మొదటి సినిమా ఇంకా రిలీజ్ కాకముందే
నాగార్జునలాంటి పెద్ద స్టార్‌తో నటించే అవకాశం రావడమంటే ... అంతకన్నా ఆనందం
ఏముంటుంది! ‘గగనం’ చాలా మంచి సినిమా. విభిన్నమైన సినిమా.
- నేను పుట్టింది, పెరిగింది అంతా ముంబైలోనే. ఇంటర్మీడియెట్ చదువుతున్నప్పుడే
మోడలింగ్ ఆఫర్స్ వచ్చాయి. అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి కదా అని అటువైపు
మళ్లాను.
- దాదాపు డెబ్భై వరకూ యాడ్స్ చేశాను. అందులో కొన్ని షారుఖ్ ఖాన్,
అక్షయ్‌కుమార్‌తో నటించినవి. అంత పెద్ద స్టార్‌సతో చేయడం ఎప్పటికీ మర్చిపోలేను.
- ‘ఇ’, ‘బాంబే టు గోవా’, ‘ధన్ ధనాధన్ గోల్’ సినిమాల్లో ప్రత్యేక పాత్రలు చేశాను.
తర్వాత తమిళంలో శింబుతో ‘శిలంబట్టమ్’లో నటించాను. దానికి ఉత్తమ నూతన నటి అవార్డు
వచ్చింది. రెండేళ్ల తర్వాత ‘తంబిక్కు ఇంద ఊరు’లో కూడా నటించాను.
- నటిగా రోల్‌మోడల్స్ ఎవరూ లేరు. కానీ మాధురీ దీక్షిత్, కాజోల్, రాణి ముఖర్జీని
అభిమానిస్తాను. వాళ్లు ఆల్‌రౌండర్స్. వారి వైవిధ్యభరితమైన నటన నన్ను వాళ్లకు అభిమానిని
చేసింది. ఇక ఓ ఆడపిల్లగా మా అమ్మనే నా రోల్‌మోడల్‌గా భావిస్తాను.
- ఓ నటికి అందాన్ని కాపాడుకోవడం చాలా అవసరం. అందుకే ఫిట్‌నెస్ విషయంలో చాలా
జాగ్రత్తగా ఉంటాను. తరచుగా జిమ్‌కి వెళ్తాను. ఆహారంలో కూడా నియమాలు పాటిస్తాను.
- అందమనేది చూసే కళ్లను బట్టి ఉంటుంది. కొందరు జీన్‌సలో కూడా గ్లామరస్‌గా
ఉంటారు. కొందరు చీర కట్టుకున్నా సెక్సీగా ఉంటారు. గ్లామరస్‌గా ఉండటంలో తప్పేమీ లేదు.
పాత్ర డిమాండ్ చేసినప్పుడు బికినీ అయినా వేసుకోవచ్చు. కానీ అందాన్ని ప్రదర్శించడమే పనిగా
పెట్టుకోకూడదు. ప్రతిభ కూడా అవసరం.
- హిందీ, ఇంగ్లిష్, మరాఠీ, ఉర్దూ భాషలు వచ్చు. రెండు తమిళ సినిమాలు చేశాను కాబట్టి
తమిళం కూడా బాగానే అర్థమవుతుంది. కానీ తెలుగు అస్సలు రాదు. దాంతో షూటింగ్ టైమ్‌లో
చాలా కష్టపడ్డాను. కానీ అందరూ సహకరించటంతో చేసేశాను. వీలైనంత త్వరలో తెలుగు
నేర్చేసుకుంటాను.