మసాలా
 
 
 
 
బిజీ అవుతున్న సందీప్ కిషన్
'స్నేహగీతం, ప్రస్థానం' చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన యువ కథానాయకుడు సందీప్‌కిషన్‌ బాలీవుడ్‌లోనూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని 2010లో టాప్‌ 3 చిత్రాల్లో ఒకటైన 'షోర్‌ ఇన్‌ ద సిటీ' చిత్రం ద్వారా బాలీవుడ్‌కు పరిచయమై అందరి దృష్టిని విశేషంగా ఆకర్షిస్తున్నాడు. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌ తాజాగా రాణాల తరువాత హిందీ సినిమాల్లో నటిస్తున్న హీరోగా సందీప్‌ గుర్తింపు తెచ్చుకున్నాడు.

'ఒక నటుడుగా అవకాశం రావడమే ఒక వరమైతే.. ఆ వచ్చిన అవకాశాన్ని నిలుపుకోవడం ఎంతో కష్టం. ఈమధ్య కాలంలో ఎంతోమంది నటీనటులు పరిశ్రమకు వచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కానీ వారిలో నిలబడింది కొంతమంది మాత్రమే. ఆ కొద్దిమందిలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా బాలీువుడ్‌లో ఎంట్రీ ఇచ్చి బాలీవుడ్‌లో టాప్‌ మూవీస్‌లో హీరోగా అవకాశం తెచ్చుకున్న సందీప్‌ మన తెలుగువాడు కావడం గర్వించదగ్గ విషయం. ప్రస్తుతం తెలుగులో 'ఎల్‌.బి.డబ్యూ'ఫేం ప్రవీణ్‌ సత్తార్‌ దర్శకత్వంలో మిక్కీ.జే.మేయర్‌ సంగీత దర్శకత్వంలో రూపోందుతున్న రోటీన్‌ లవ్‌స్టోరిలో సోలో హీరోగా చేస్తూ తమిళ్‌లో రెడ్‌పోస్ట్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై రూపుదిద్దుకుటున్న 'యారుడ మహేష్‌' అనే చిత్రం కూడా చేస్తుండడం విశేషం. ఈ రెండు చిత్రాలు 70% చిత్రీకరణ పూర్తిచేసుకుని త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో తెలుగులో మరో రెండు సంచలన చిత్రాలతో సందీప్‌ కిషన్‌ మనముందుకు రాబోతున్నాడు.

మంచు లక్ష్మి నిర్మాతగా మాస్ట్రో ఇళయరాజా సంగీత దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న 'గుండెల్లో గోదారి' అనే మల్టీ స్టారర్‌ చిత్రంలో సందీప్‌కిషన్‌తో పాటు ఆది పినిశెట్టి, తాప్సీ మరియు మంచు లక్ష్మి నటిస్తున్నారు. ఇందులో మాస్‌ యాక్షన్‌ హీరోగా తన పాత్ర వుండడం విశేషం. అలాగే 'ఓరు' ఫేం ఆనంద్‌రంగా నిర్మిసున్న ద్విభాషా చిత్రంలో కూడా సందీప్‌కిషన్‌ హీరోగా నటిస్తుండడం విశేషం. ఈ చిత్రం ఔట్‌ అండ్‌ ఔట్‌ కామెడీ చిత్రంగా రూపుదిద్దుకుంటుంది. సో ఈ నూతన సంవత్సరంలో సందీప్‌కిషన్‌ తన చిత్రాలతో ప్రేక్షకుల్లోకి మరింతంగా దూసుకెళ్ళడం ఖాయం అంటున్నారు చిత్ర ప్రముఖులు..