నటులుగా సినిమాల్లో స్థానం దక్కాలంటే ఎంతో ప్రయత్నం అవసరం. ఇక కొత్తవారి సంగతి చెప్పక్కర్లేదు. ఎంతోమందిని
మెప్పిస్తేకానీ ప్రముఖ దర్శక, నిర్మాతల చిత్రాల్లో అవకాశం రాదు. అటువంటిది తొలి చిత్రంతోనే దర్శకరత్న దాసరి
నారాయణరావు సినిమాలో ఛాన్స్ ఎలా దక్కిందో చెప్పుకొచ్చింది నూతన నటి సందీప్తి...
‘‘హీరోయిన్‌గా 'యంగ్ ఇండియా'లో నన్ను దాసరి పరిచయం చేశారు. తొలి సినిమాకే గొప్ప దర్శకుల పర్యవేక్షణలో
పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నా. ప్రస్తుతం రాజేంద్రప్రసాద్, సుహాసిని జంటగా వస్తున్న చిత్రంలో వాళ్ల కుమార్తెగా ఓ
పాత్ర చేస్తున్నా. వరుణ్‌సందేశ్‌తో మరో చిత్రం ఉంది. మాది విజయనగరం జిల్లా. అక్కడున్న మహారాజా సంగీత
నృత్యకళాశాలలో భరతనాట్యంలో డిప్లొమా చేసాను. బికాం చదువుతున్నా. ఐదో ఏటనే నృత్యంలో ప్రవేశించి 500 ప్రొగ్రామ్‌లు
ఇచ్చాను. నృత్యరంజని, బాలమిత్ర, లేతగులాబి, లిటిల్‌రోజ్ ఆఫ్ విజయనగరం వంటి బిరుదుల్ని అందుకున్నా. చదువు,
నటన, నాట్యం నాకు ప్రాణం. డాన్స్‌లో ఎం.ఎ. చేయాలన్నదే నా కోరిక. ‘యంగ్‌ఇండియా’లో నా పాత్రకు నేనే డబ్బింగ్
చెప్పుకున్నా’’ అని మురిసిపోతోంది సందీప్తి.
|