ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణిగా సాండ్రా బులాక్ పేరుతెచ్చుకుంది. పలువురు హాలీవుడ్
తారామణులను వెనక్కినెట్టి సాండ్రా సినిమాలకు ఎక్కువగా పారితోషికం తీసుకుంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
గత ఏడాది ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రపంచంలో అత్యధికంగా పారితోషికం తీసుకునే సినిమా నటుల జాబితాను
విడుదల చేసింది. ఈ జాబితాలో హాలీవుడ్ నటి సాండ్రా బులాక్ ప్రపంచంలోనే మొదటిస్థానంలో నిలిచింది.
ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే నటిగా హాలీవుడ్ నటి సాండ్రా బులాక్ మొదటిస్థానంలో నిలిచింది.
ఈ మేరకు ఫోర్బ్స్ మ్యాగజైన్ ఈ విషయాన్ని వెల్లడించింది.
ఇప్పటికే పలు అవార్డులు అవార్డులు సొంతం చేసుకున్న ఈ అమ్మడికి ఈ విషయంలో చాలా పోటీ
ఏర్పడినప్పటికీ చివరికి విజయాన్ని మాత్రం సొంతం చేసుకుంది. ఫోర్బ్స్ జాబితాలో టాప్‌ర్యాంక్ సాధించినప్పటి
నుంచి సాండ్రాకు ఆదాయం మరింత పెరగడం విశేషం. 2009-2010 సంవత్సరానికిగాను సాండ్రా 56 మిలియన్
డాలర్లు(రూ.2,500 కోట్లు)ఆర్జించినట్లు ఫోర్బ్స్ వెల్లడించింది. గతంలో హాలీవుడ్ నటుడు జెస్సీ జేమ్స్ ఈ స్థానంలో
ఉండగా ఆ స్థానాన్ని ఇప్పుడు సాండ్రా భర్తీ చేసింది.
ఇప్పటికే ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నటిగాను, ఎక్కువ చిత్రాలు విజయవంతమైన నటిగాను
సాండ్రా రికార్డు సృష్టించగా ఇప్పుడు ఆమె ఖాతాలో మరో కలికితురాయి చేరింది. రెండు సంవత్సరాల క్రితం
విడుదలైన ‘ది బ్లైండ్‌సైడ్’ అనే చిత్రానికి గాను సాండ్రా ఆస్కార్ అవార్డును కూడా సొంతం చేసుకుంది. ఇండస్ట్రీలో
తనకు పోటీ నటులుగా ఉన్నవారితోనూ మంచి సంబంధాలను కొనసాగించడంలో సాండ్రా ముందంజలో
ఉంటుంది.