మసాలా
 
 
 
 
అగ్నిపథ్‌ లోగుండుతో సంజయ్‌దత్‌
షూటింగ్‌ జరుపుకుంటున్న అగ్నిపథ్‌ సినిమాలో సంజయ్‌దత్‌ తన తలను క్లీన్‌ షేవ్‌ చేయించుకొని కనిపిస్తారు. తొలిసారిగా ఆయన గుండుతో ఈ సినిమాలో కనిపించనుండడం విశేషం.

ఏ హీరోనైనా సినిమాల్లో గుండుతో కనిపించేందుకు ఇష్టపడరు. బట్టతల ఉన్న లేటు వయసు హీరోలైనా విగ్గులతో నిండుగా వెంట్రుకలు కనిపించేవిధంగా దర్శనమిస్తారు. కానీ సంజయ్‌దత్‌ మాత్రం విభిన్నంగా అగ్నిపథ్‌ సినిమాలో గుండుతో కనిపించనున్నారు. అగ్నిపత్‌ సినిమాలో సంజూ నిజంగానే తలకు క్లీన్‌ షేవ్‌ చేయించలేదు. ఇందు కోసం ఆయన తలకు ప్రత్యేక మేకప్‌తో గుండు కనిపించేవిధంగా చేశారు. ఈ మేకప్‌ కోసం అతనికి మూడు గంటల సమయం పడుతుండగా దాన్ని తీసివేసేందుకు గంటన్నర సమయం పడుతోంది. కానీ వేడి మూలంగా ఎక్కువ సేపు షూటింగ్‌ చేస్తే మేకప్‌ కరిగిపోతుడడం సంజయ్‌దత్‌కు తీవ్ర ఇబ్బందిని కలిగిస్తోంది.

ఇక సంజూ గుండులో కనిపించేందుకు ప్రత్యేకంగా హాలీవుడ్‌ మేకప్‌ ఆర్టిస్ట్‌ రాబిన్‌ స్లేటర్‌ను రప్పించారు. తలకు క్లీన్‌ షేవ్‌ చేయకుండానే ఈ మేకప్‌ ఆర్టిస్ట్‌ సం జూకు ఎంతో సహజ సిద్దమైన బాల్డ్‌ లుక్‌ను తీసుకువచ్చారు. గుండులో రెండు రోజుల పాటు ముంబయ్‌లో షూటింగ్‌ బాగానే జరిగినప్పటికీ మూడవ రోజు నుంచే కష్టాలు ప్రారంభమయ్యాయి. మేకప్‌ వేడికి మెల్లిగా కరగడం ప్రారంభించి సంజయ్‌దత్‌ ముఖం పైకి రావడం జరిగింది. ఇక సంజయ్‌ ప్రతిరోజు 5 గంటలకు లేచి 9.30 గంటల వరకు రెఢీ అయి షూటింగ్‌కు వస్తున్నారు.

కానీ బాల్డ్‌ లుక్‌ కోసం మేకప్‌ అతన్ని ఇబ్బంది పెడుతోంది. చివరికి సంజయ్‌ దత్‌, అతని భార్య మాన్యతలు అగ్నిపథ్‌ కోసం గుండు గీయించడమే మేలని నిర్ణయించారు. కానీ ఈ సినిమాతో పాటు మరికొన్ని సినిమాలు కూడా చేస్తున్న సంజూ వాటి పరిస్థితి ఏంటని ఆలోచించారు. వెంటనే హాలీవుడ్‌ నుంచి ప్రముఖ విగ్‌ మేకర్‌ విక్టోరియా ఉడ్‌ను రప్పించి తాను గుండు గీయించుకున్న తర్వాత ధరించేందుకు ఓ మంచి విగ్‌ను తయారు చేయాలని కోరగా దీనికి ఆయన సరేననన్నారు.

‘బాల్డ్‌ లుక్‌ కోసం గుండు మేకప్‌ మొదట బాగానే అనిపించింది. కానీ మూడు గంటల పాటు మేకప్‌ చేయించుకో వడం తీసివేయడానికి గంటన్నర పట్టడం ఇబ్బందిగా అనిపిస్తోంది. వేడి మూలంగా మేకప్‌ కరిగిపోవడంతో మరిన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. దీంతో గుండు గీయించుకోవడం మేలని నిర్ణయించుకున్నాను. ఇక అగ్నిపథ్‌లో నా కొత్త గెటప్‌ను అభిమానులు ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాను.మిగతా సినిమాలను విగ్‌తో చేస్తాను.’ అని సంజయ్‌దత్‌ వెల్లడించారు.