నిత్యానంద రాసలీలల ఆధారంగా కన్నడలో సత్యానంద పేరిట సినిమా తీస్తున్నట్టు బీజేపీ
సీనియర్ నాయకుడు, రచయిత, నిర్మాత, దర్శకుడు మదన్‌పటేల్ పేర్కొన్నారు. శుక్రవారం
విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషలతోపాటు
పలు భాషల్లోకి అనువదించనున్నట్లులిపారు. నిత్యానంద స్వామి పోలికలు ఉన్న ఒక
యువకుడు ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెలిపారు. నటి రంజిత తాను నిత్యానందతో
రాసలీలలు సాగించలేదని చెప్పడాన్ని మదన్ పటేల్ ఖండించారు. అదే నిజమైతే సత్యానంద
చిత్రంలో నటించడానికి ముందుకు రావాలని సవాల్ విసిరారు.
కొద్ది రోజుల క్రితం రంజిత విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తాను నిత్యానందతో రాసలీలలు
సాగించలేదని పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. విలేకరుల సమావేశం మరుసటి రోజే
నిత్యానంద ఆశ్రమానికి రంజిత వెళ్లి పాదపూజ నిర్వహించడం నిజం కాదా.. అని ప్రశ్నించారు.
కావాలంటే తాను ఇప్పుడే రంజితతో మాట్లాడతానంటూ ఆమెకు ఫోన్ చేశారు. అయితే స్విచ్చాఫ్
చేసి ఉన్నట్లు రావడంతో ఆ ప్రయత్నాన్ని విరమించారు. నిత్యానంద వల్ల వేధింపులకు
గురైనవారు, మోసపోయిన వారు తనకు వివరాలు వెల్లడించాలని.. వారి పేర్లు, వివరాలు
గోప్యంగా ఉంచుతానని చెప్పారు. సత్యానంద సినిమా పోస్టర్లలో నిత్యానంద ఫొటోను తాను
ఉపయోగించుకోలేదన్నారు.
|