మసాలా
 
 
 
 
షాహిద్‌తో డేటింగ్‌లో బిపాసా బసు
బాలీవుడ్‌ సుందరాంగి బిపాసా బసు గత కొన్ని రోజులుగా హీరో షాహిద్‌ కపూర్‌తో డేటింగ్‌ చేస్తున్నారు. జాన్‌ అబ్రహంతో విడిపోయిన తర్వాత ఈ అందాలభామ షాహిద్‌తో ఎంతో సన్నిహితంగా ఉంటూ కలిగి తిరుగుతుండడం విశేషం. పార్టీలు, ఫంక్షన్లలో కనిపిస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది ఈ కొత్త జంట.

బిపాసా బసు ఈ మధ్య తన స్నేహితులతో మాట్లాడుతూ తన జీవితంలో ఓ స్వీట్‌ గయ్‌...ప్రేవేశించాడని చెబుతున్నారు. అతనితో డేటింగ్‌ తనకు ఓ మధురానుభూతి అని ఆమె పేర్కొంటున్నారు. అతను మరచిపోలేని గిఫ్ట్‌లను ఇస్తూ అబ్బురపరుస్తున్నాడనీ అతనితో కలిసి పార్టీలు, ఫంక్షన్లకు హాజరవ్వడం తనకెంతో సంతోషాన్నిస్తోందని అంటున్నారు. చివరికి అతను షాహిద్‌ కపూర్‌ అని బిపాసా స్నేహితులకు తెలియడంతో వారంతా ఆశ్చర్యపోయారు.

నెల రోజుల నుంచి వారిద్దరి మధ్య డేటింగ్‌ నడుస్తున్నట్టు సమాచారం. ఇక బిపాసా, షాహిద్‌లు కలిసి ఏ సినిమా చేయలేదు. కానీ వీరిద్దరి మధ్య పరిచయం ఎలా ఏర్పడింది అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. షాహిద్‌ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ అబ్బాస్‌ అతన్ని బిపాసాకు పరిచయం చేశాడు. అబ్బాస్‌ బిపాసాకు సైతం ఫిట్‌నెస్‌ ట్రైనర్‌గా చేశాడు. అబ్బాస్‌ ద్వారా పరిచయమైన బిపాసా, షాహిద్‌లు చాలా సన్నిహితంగా మారారు. ఇక బిపాసా, షాహిద్‌లిద్దరూ తమ చిరకాల ప్రేమికులైన జాన్‌ అబ్రహం, ప్రియాంకా చోప్రాల నుంచి దూరమయ్యారు.

ఇక షాహిద్‌ కొద్ది రోజుల క్రితం అంధేరిలోని తన ఇంటిని ఆధునీకరించాడు. అనంతరం నిర్విహంచిన పార్టీకి తన స్నేహితులు, సన్నిహితులైన 20 మందిని ఆహ్వానించాడు. వీరిలో బిపాసా కూడా ఉన్నారు. ఇక ప్రస్తుతం బిపాసా, షాహిద్‌ కపూర్‌ల మధ్య ప్రేమాయణం జోరుగా సాగుతుందని వారి సన్నిహితులు పేర్కొంటున్నారు. కానీ వీరిద్దరు ఎంత కాలం కలిసి ఉంటారో చూడాల్సిందేనని వారు అంటున్నారు. కానీ బిపాసా, షాహిద్‌లు సన్నిహితంగా మారడం వారి మాజీ ప్రేమికులు జాన్‌ అబ్రహం, ప్రియాంకా చోప్రాలకు ఆగ్రహం తెప్పిస్తోంది. తిరిగి కలుస్తారని ఆశించిన వారికి ఈ కొత్త ప్రేమాయణం ఇబ్బందిగా మారింది.