బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూఖ్‌ఖాన్, అమెరికన్ పాపులర్ సింగర్ ఎకాన్, మాజీ టెన్నిస్ స్టార్ బోరిస్ బెకర్...వీరంతా
కలిసి డ్యాన్స్ చేస్తే అందరూ మంత్రముగ్దులై చూస్తారు. ఇటువంటి దృశ్యానికి వేదికగా మారింది లండన్‌లోని ఒ2
ఎరీనా ఆడిటోరియమ్. ఓ కార్పొరేట్ ఈవెంట్‌కు వీరంతా స్పెషల్ గెస్ట్‌లుగా హాజరై కార్యక్రమంలోని పాల్గొని
ఆహుతులను అలరించారు. ఆడుతూ, పాడుతూ సందర్శకులకు మధురానుభూతులను పంచారు.
లండన్‌లో జరిగిన ఓ పెద్ద కార్పొరేట్ సంస్థ ఈవెంట్ ఆహూతులకు చక్కటి వినోదాన్ని పంచింది.
ఈ కార్యక్రమానికి బాలీవుడ్ స్టార్ షారూఖ్‌ఖాన్, మాజీ టెన్నిస్ దిగ్గజం బోరిస్ బెకర్, అమెరికన్ టాప్ సింగర్
ఎకాన్‌లు హాజరై వేదికపై డ్యాన్సులు చేశారు. వారు ఉత్సాహంగా వేసిన స్టెప్పులు సందర్శకులను
హుషారెత్తించింది. ఈ ఈవెంట్‌కు బాలీవుడ్ స్టార్లు రణభీర్ కపూర్, అనుష్క శర్మలు సైతం హాజరయ్యారు. ఇక
మ్యూజిక్ లెజెండ్ ఎ.ఆర్.రెహ్మాన్ విశిష్ట అతిథిగా హాజరై కొంతసేపు ఉండి వెళ్లిపోయారు.
షారూఖ్‌కు మంచి మిత్రుడైన డీజె బెన్నీ-డెమస్ స్టేజ్‌పై ప్రదర్శననిచ్చి అందర్నీ హుషారైన సంగీత ఝరిలో
ముంచెత్తారు. రణభీర్ కూడా కొద్దిసేపు వేదికపై స్టెప్పులు వేసి అలరించారు. ఈ కార్పొరేట్ ఈవెంట్ సక్సెస్‌ఫుల్‌గా
కొనసాగింది. ఈ కార్యక్రమం కోసం బాలీవుడ్ స్టార్లు ఒక రోజు ముందుగానే లండన్‌కు వచ్చారు. ‘అమెరికన్ సింగర్
ఎకాన్, టెన్నిస్ స్టార్ బోరిస్ బెకర్‌తో కలిసి స్టెప్పులు వేయడం ఎంతో ఆనందాన్నిచ్చింది. వెస్ట్రన్ మ్యూజిక్ హోరులో
బాలీవుడ్ డ్యాన్సులు చేసి ఆహూతులను అలరించాను. కార్పొరేట్ ఈవెంట్ సక్సెస్‌ఫుల్‌గా కొనసాగి
సందర్శకులకు మరచిపోలేని అనుభూతులను మిగిల్చింది’అని షారూఖ్‌ఖాన్ వెల్లడించారు.