ఎటువంటి పాత్రలనైనా చేయగల దమ్మున్న షారుఖ్‌ఖాన్ హీరో నిర్వచనాన్చే మార్చేశాడని ప్రముఖ రచయిత,
సినీ విశ్లేషకురాలు అనుపమ చోప్రా అన్నారు. ఆమె తాజా రచన ‘ఫస్ట్ డే, ఫస్ట్ షో:రైటింగ్స్ ఫ్రమ్ ది బాలీవుడ్
ట్రెంచెస్’ పుస్తకంలో షారుఖ్ జీవితం గురించిన ఆసక్తికర విషయాలను వెల్లడిం చారు. ‘ముంబైలో ఓ మిట్ట
మధ్యాహ్నం. అర్ధనగ్నంగా ఉన్న ఒక కుర్రాడి మెడలో లావైన బంగారు గొలుసు. చెదిరిపోయిన జుట్టులో వేళ్లు
పెట్టి వెటకారంగా నవ్వుతూ అద్భుతంగా కనిపిస్తాడు’ అంటూ 1995లో విడుదలైన షారుఖ్ చిత్రం రామ్‌జానేలో
ఆయన వేషధారణ గురించి అభివర్ణించారు. అక్కడ సీన్ కట్ చేస్తే 2000 సంవత్సరం. రామ్‌జానేలో సాదాసీదా
హీరో పాత్ర పోషించిన షారుఖ్ ఇప్పుడు బాలీవుడ్ అగ్రహీరోల్లో ఒకరిగా నిలుస్తున్నారు.
తాజాగా టొరంటోలో నిర్వహించిన చిత్రోత్సవంలో ఎస్‌ఆర్‌కే ప్రత్యేక ఆకర్షణ కాబోతున్నారు. సినిమా నిర్మాణం,
సాంకేతికరంగాలు, క్రికెట్ ఇలా అన్ని రంగాల్లోనూ విజయం సాధించారు. నాటి నుంచి నేటి వరకు షారుఖ్
వస్తధ్రారణ అద్భుతంగా ఉంటుందని అనుపమ తన పుస్తకంలో రాశారు. ‘షారుఖ్‌లోని శక్తి ఆయన శైలిని
ప్రకటిస్తుంది. ఆయనకు శైలే అన్నింటికంటే ముఖ్యం. మొదట్లో తెరపై అంత బాగా కనిపించకపోయినా..
ఇప్పుడున్న వారిలో అత్యంత ఆకర్షణ ఉన్నది షారుఖ్‌కే. రెండు దశాబ్దాలుగా ప్రేక్షకులతో చెక్కు చెదరని
అనుబంధాన్ని ఏర్పరచుకున్నారు’ అని ఈ పుస్తకం వివరిస్తుంది. షారుఖ్ సినీప్రస్థానంపై ఆమె స్పందిస్తూ
‘బాలీవుడ్‌లో హీరోలు జన్మించరు. రూపొందుతారు. ఇక్కడ ఆదరణ కావాలంటూ కొన్ని నియమాలుంటాయి.
అందరు హీరోల్లా కాకుండా ప్రేక్షకులకు దగ్గర కావడానికి షారుఖ్ విభిన్నమార్గం ఎంచుకున్నారు. చక్కటి
నటన, సరికొత్త హెయిర్‌స్టైల్, ప్యాంట్స్, షర్టులు, టక్‌చేసే విధానంతో భారీగా అభిమానులను సంపాదించుకున్నారు’
అని రాసుకొచ్చారు. ఆశావహ దృక్పథం, అందర్నీ నవ్వించే గుణం, ఎప్పుడూ ఉత్సాహంగా ఉండడం వంటి
లక్షణాలు కూడా కలిసి వచ్చాయని విశ్లేషించారు. దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే, చక్‌దే ఈ కింగ్‌ఖాన్ అత్యంత
ప్రీతిపాత్రమైన సినిమాలు.