బాలీవుడ్ బాద్‌షా షారుక్‌ఖాన్‌కు సంబంధించిన ఏ విషయమైనా వార్తే అవుతుంది. ఎందుకంటే షారుక్‌కు అంత క్రేజ్ ఉంది. అసలు అతనే తన వ్యాఖ్యలతో క్రేజ్ సృష్టించుకుంటూ వార్తల్లో ఉంటాడు. సరదాగా మాట్లాడే బాద్‌షా తనమీద తనే జోకులేసుకుంటాడు. వ్యంగ్యోక్తులు విసురుకుంటాడు. ఈసారి తన మనసులో ఉన్న అసలు నిజం ఒకటి చెప్పి ఢిల్లీలో మాటల బాంబు పేల్చాడు. సినిమాల్లోకి రాకముందు...అశ్లీల చిత్రాల్లో నటించి స్టార్‌ను కావాలని తనకు ఎంతగానో కోరిక ఉండేదని విచిత్రమైన ప్రకటన చేశాడు.
‘అశ్లీల చిత్రా స్టార్‌ను కావాలని ఎప్పుడూ అనుకునేవాడిని. అందుకు ఎంతో ఆశతో కొన్ని ప్రయత్నాలూ చేశాను’ అని షారుక్ తనను కలిసిన కొంతమంది అభిమానులతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ చెప్పాడు. ఇంకా చిత్రమేమిటంటే తనకా ఆలోచన ఎలా వచ్చిందో కూడా చెప్పాడు. ‘నేను సిల్వెస్టర్ స్టాలోన్ వీరాభిమానిని. హాలీవుడ్‌లో సూపర్‌స్టార్ కాకముందు స్టాలోన్ అశ్లీల చిత్రాల్లో నటించాడు’ అని వివరించాడు. చుట్టూ ఉన్న జనానికి ఏదోకటి చెప్పి నవ్వించడం షారుక్ అలవాటు. అతను చెప్పింది విని అక్కడున్నవారు పగలబడి నవ్వారు.
‘ప్రపంచంలోనే నంబర్ వన్ అశ్లీల చిత్రా స్టార్ అయ్యాక అమెరికాకు వెళ్లి అక్కడ కూడా నా ప్రతాపాన్ని చూపాలనుకున్నాను’ అని కూడా బాలీవుడ్ బాద్‌షా అన్నాడు. రచయిత ఆరిందమ్ చౌదరి పుస్తకంలో కొన్ని భాగాల్ని చదివి వినిపిస్తూ సిల్వెస్టర్ స్టాలోన్ ప్రస్తావన తెచ్చారు. అశ్లీల చిత్రాల నటుడి స్థాయి నుంచి హాలీవుడ్ ప్రముఖుడిగా స్టాలోన్ ఎలా ఎదిగినదీ తన పుస్తకంలో వివరించానని చౌదరి చెప్పారు. సోనీ సంస్థ వ్యవస్థాపకుడు అకియో మోరిటా జీవితంలో ఎలా ఉన్నతశిఖరాన్ని చేరుకున్నదీ చౌదరి వివరించారు. అప్పుడు షారూక్ చలోక్తిగా ‘నాలాంటి స్టూడెంట్స్ అంతే. మంచి ఉదాహరణల్ని తీసుకోరు. వాటిలో ఉన్న కొద్దిపాటి చెడువిషయాల్నే తీసుకుంటారు’ అనగానే అందరూ నవ్వేశారు.
|