Bookmark and Share   Cinevinodam
Subscribe
 
 
కొత్త షో లో షారుఖ్

      ఎప్పుడూ షూటింగ్‌, ఫ్యామిలీ.. లేదంటే విదేశీ టూర్లతో బిజీబిజీగా ఉండే కింగ్‌ఖాన్‌ త్వరలో బల్లితెరపై దర్శనమివ్వబోతున్నాడు. ఇందులో ప్రత్యేకత ఏముంది, ఆయన వచ్చిందే బుల్లితెరనుండి కదా, అంతేకాకుండా ‘కౌన్‌ బనేగా కరోర్‌పతి’ యాంకర్‌గా ఇప్పటికే బుల్లితెర ప్రేక్షకులను అలరించాడు కదా అంటారా!.. అవును అయ్యుండొచ్చు కానీ ఇప్పుడు చేస్తున్న ప్రోగ్రాం ఒక అంతర్జాతీయ హోదాగల ఛానెల్‌ కోసం. భారత్‌లో లీడింగ్‌ లైఫ్‌ స్టైల్‌ ఛానెల్‌ అయిన డిస్కవరీ ట్రావెల్‌ అండ్‌ లివింగ్‌ ఛానెల్‌లో ప్రసారం కానున్న ఓ వినూత్న కార్యక్రమంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే బాలీవుడ్‌లో కింగ్‌ ఖాన్‌గా పేరున్న బాద్‌షా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న టీవీ ప్రేక్షకులును అలరించనున్నాడు. ఇండియాలో ఉన్న లైఫ్‌స్టైల్‌ ఛానెల్స్‌లో డిస్కవరీ ట్రావెల్‌ అండ్‌ లివింగ్‌ది ప్రత్యేకస్థానం. ప్రపంచంలో ఉన్న టూరిజం డెస్టినేషన్స్‌తో పాటు.. వివిధ ప్రాం తాల్లో ఉన్న ప్రజల జీవనవిధానాన్ని, టూరిజం, వంటలు, ఫ్యాషన్‌, సంబంధాలు, డిజైన్‌, సంగీతం కార్యక్రమాలని ఈ ఛానెల్‌ ప్రసారం చేస్తోంది. అయితే ఒక ఇండియన్‌ సెలెబ్రిటీతో కార్యక్రమాన్ని నిర్వహించడం మాత్రం ఇదే తొలిసారి. షారూఖ్‌ నటిస్తున్న ఈ స్పెషల్‌ ప్రోగ్రాం.. ఫిబ్రవరి 26 నుండి మొత్తం 10 పార్టులతో.. ప్రతి శుక్రవారం రాత్రి 9 గంటలకు ప్రసారం కానుంది.

ఈ షో గురించి రాహుల్‌ జోరీ (సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, జనరల్‌ మేనేజర్‌ ఇండి యా డిస్కవరీ నెట్‌వర్క్‌ ఆసియా) మాట్లాడుతూ ‘‘ఇండియాలోని మధ్యతరగ తి ప్రేక్షకులతో పాటూ... సామాన్యులు కూడా వీక్షించే విధంగా ఉండాలనే ఉద్దేశం తో మేం షారుఖ్‌ని ఎంచుకున్నాం. ఆయనతో వర్క్‌ చేయటం చాలా థ్రిల్లింగ్‌గా ఉంది. ఇది ఓ అద్భుతమైన ప్రొగ్రాంగా టెలివిజన్‌ హిస్టరీలో మిగిలిపోతుందను కుంటున్నా.’’ అని అన్నారు.

‘‘ఈ ఐడియా రావటమే ఆలస్యం నేను ఓ.కే. చెప్పేసాను. ఎందుకంటే దీని వల్ల నా ఫాన్స్‌కి మరింత దగ్గరవ్వొచ్చు పబ్లిగాగా నన్ను చూడాలని చాలామందికి ఉం టుంది. కానీ ఇప్పటి వరకు వారికి అవకాశం రాలేదు. ఇప్పుడ ఈ ప్రొగ్రాంతో నా ఫ్యాన్స్‌ను కలవబోతున్నందుకు చాలా ఆనందంగా ఉంది.’’ అని తన ఆనందాన్ని వ్యక్తపరిచాడు షారూఖ్‌ ఖాన్‌..

 
 

Copy right reserved for www.cinevinodam.com 2005