కొలంబియాకు చెందిన ప్రపంచ ప్రఖ్యాత పాప్ సింగర్ షకీరా ఇసబెల్ మెబారక్ రిపోల్.
సింగర్‌గానే కాకుండా సాంగ్ రైట ర్,మ్యూజిషియన్, రికార్డ్ ప్రొడ్యూసర్, డ్యాన్సర్,
ఫిలాంత్రోపిస్ట్‌గా ఈ అందాలభామల నేడు యూత్‌ను ఉర్రూతలూగిస్తున్నారు. ఇటీవల
అత్యంత వైభవంగా జరిగిన సాకర్ పోటీల్లో షకీరా ప్రత్యేక ఆకర్షణగా మారింది. సాకర్
ప్రారంభంలోనూ, ముగింపులోనూ షకీరా ప్రదర్శన ఉర్రూతలూగించింది. ఈ ప్రఖ్యాత
సింగర్ త్వరలో ఓ బాలీవుడ్ సినిమాలో పాడేందుకు ఒప్పుకోవడం విశేషం. తన
పాప్‌సాంగ్స్, రాక్ మ్యూజిక్‌తో ప్రపం చవ్యాప్తంగా ఉన్న మ్యూజిక్ లవర్స్‌ను
అలరిస్తున్న ఈ అందా లభామ త్వరలో బాలీవుడ్‌లో మొదటిసారిగా ప్లేబ్యాక్
సింగర్‌గా ఓ పాట పాడనుండడం విశేషం.
1990 దశకం ప్రారంభంలో లాటిన్ అమెరికాలోని మ్యూజిక్ సీన్‌పై
మొదటిసారిగా దర్శనమిచ్చిన సెలబ్రిటీ సింగర్ షకీరా. కొలంబియాలోని
బరాంక్విల్లాలో జన్మించిన ఈ సింగర్ స్కూల్లో చదువుతున్న సమయంలోనే
సింగర్‌గా మ్యూజిక్ లైవ్ పర్‌ఫా ర్మెన్స్‌ను ఇచ్చి అందర్నీ అలరించేవారు. పాప్, రాక్
అండ్ రోల్, మిడిల్ ఈస్టర్న్ స్టైల్‌తో పాటలు పాడే ఈ సింగర్ మ్యూజిక్ కన్సర్ట్‌లలో
ప్రత్యేకంగా బెల్లీ డ్యాన్స్ చేస్తూ మ్యూజిక్ లవర్స్‌ను మైమర పిస్తారు. 1995లో ఆమె
విడుదల చేసిన మ్యూజిక్ ఆల్బమ్ పైస్ డెస్క ల్జోస్ షకీరాకు లాటిన్ అమెరికా,
స్పెయిన్‌లలో ఎంతో పేరు తీసుకు వచ్చింది. ఇక 1998లో మ్యూజిక్ లవర్స్
ముందుకు వచ్చిన డోండె ఈస్టన్ లాస్ లడ్రోన్స్ ఆల్బమ్ సైతం మంచి సక్సెస్‌ను
సాధించింది.
అనంతరం షకీరా ప్రపంచవ్యాప్తంగా ఎం తో పాపులారిటీ సంపాదించి లక్షలా ది
అభిమాలను తన మ్యూజిక్, సాం గ్స్‌తో అలరిస్తూ వస్తోంది. షకీరా సూపర్ హిట్
మ్యూజిక్ ఆల్బమ్ లాం డ్రీ సర్వీస్ 13 మిలియన్ కాపీలు అమ్ముడై రికార్డు
సృష్టించింది. ఆతర్వాత ఫిజక్షన్ ఓరల్ వాల్యూమ్ 1, ఓరల్ ఫిక్సేషన్ వాల్యూమ్ 2
మ్యూజిక్ ఆల్బమ్‌లు సైతం మంచి సక్సెస్‌ను సాధించాయి. గత ఏడాది చివరన
విడుదల చేసిన షి ఓల్ఫ్ ఆల్బమ్ ప్రపంచవ్యాప్తంగా రిలీజై యూత్‌ను
ఉర్రూతలూగించింది. ఇక ఈ ప్రఖ్యాత సింగర్ ఇప్పటివరకు రెండు గ్రామీ అవార్డులు,
ఏడు లాటిన్ గ్రామీ అవార్డులను దక్కించుకున్నారు. 12 బిల్‌బోర్డు లాటిన్ మ్యూజిక్
అవార్డులు సైతం ఈ స్టార్ సింగర్‌ను వరించాయి.
నేడు బాలీవుడ్ సినిమాలు మన దేశంతో పాటు అమెరికా, యూరప్ దేశాలలో సైతం
విడుదలై రికార్డు కలెక్షన్లను వసూలు చేస్తున్నాయి. అక్కడి ఎన్‌ఆర్‌ఐలతో పాటు
పాకిస్తాన్, బంగ్లాదేశ్ తదితర ఆసియా దేశాలవాసుల్లో హిందీ సినిమాలకు ఎంతో క్రేజ్
ఉంది. దీంతో నేడు బాలీవుడ్ నిర్మాతలు హాలీవుడ్ హీరోయిన్‌లతో పాటు
ప్రపంచవ్యాప్తంగా పేరొందిన టాప్ పాప్ సింగర్లను సైతం తమ సినిమాల్లో
పనిచేసేందుకు ఆఫర్‌చేస్తున్నారు. ఈ నేపథ్యంలో లాటిన్ అమెరికన్ సింగింగ్
సెన్సేషన్ షకీరా బాలీవుడ్ సినిమాల్లో పాడేందుకు ఓకే చెప్పడం విశేషం. ప్రముఖ
పారిశ్రామికవేత్త సచిన్‌జోషి నిర్మాతగా రూపుదిద్దుకుంటున్న ఓ హిందీ సినిమాలో
షకీరా పాడేందుకు ఒప్పుకోవడం విశేషం.
ఈ సినిమాలో దక్షిణాఫ్రికాకు చెందిన టాప్ మోడల్ క్యాడైస్ బోచర్‌పై చిత్రీకరించే
పాటను షకీరా పాడేందుకు సమ్మతించింది. కొద్దినెలల్లో ఈ పాట రికార్డింగ్
జరుగనున్నట్టు సమా చారం. ఇక షకీరా మన దేశానికి కొత్తేమి కాదు. ఆమె 2007లో
ముంబయ్‌లో జరిగిన లైవ్ మ్యూజిక్ కన్సర్ట్‌ను నిర్వహించి మ్యూజిక్ లవర్స్‌ను
ఉర్రూతలూగించారు. ఆ సమయంలోనే బాలీవుడ్‌లో పాటలు పాడాలనే తన కోరికను
వ్యక్తంచేయడం విశేషం. ఇక త్వరలో షూటింగ్ జరుపుకునే నిర్మాత సచిన్ జోషి
బాలీవుడ్ సినిమాకు సలీమ్-సులేమాన్‌లు సంగీత దర్శకత్వం వహించనున్నారు.
వారి సంగీత సారధ్యంలో షకీరా పాడనున్నారు. ఈ పాట ఇంగ్లీష్, హిందీ మిక్సింగ్‌తో
రూపుదిద్దు కోనున్నట్టు సమాచారం. ఇక టోనీ డిసౌజా రూపొందించిన బ్లూ
మ్యూజిక్ ఆల్బమ్‌లో ఆస్ట్రేలియన్ టాప్ పాప్ సింగర్ కైలీ మినోగ్ పాడిన డ్యూయెట్
లాంటి పాట మాత్రం ఇది కాదని సంగీత దర్శకులు సలీమ్ సులేమాన్‌లు
చెబుతున్నారు. షకీరా పాడే పాట క్యాబరే టైప్‌లో రూపుదిద్దుకుంటుందని వారు
వివరించారు.
|