మసాలా
 
 
 
 
షకీరాకు 'ఆర్టిస్ట్ ఆఫ్ ది ఇయర్' అవార్డ్‌
పాప్‌ ప్రపంచంలో తిరుగులేని రారాణిగా వెలుగొందుతున్న సింగర్‌ షకీరా. ఆమె పలు హిట్‌ సాంగ్స్‌తో యూత్‌ను ఉర్రూతలూగిస్తుండడంతో ఆమె మ్యూజిక్‌ ఆల్బమ్స్‌ రికార్డు స్థాయిలో అమ్ముడవుతున్నాయి. ఇక ఈ ప్రఖ్యాత సింగర్‌ హార్వర్డ్‌ ఫౌండేషన్స్‌-2011 ఆర్టిస్ట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ గా ఎంపిక కావడం విశేషం. హార్వర్డ్‌ ఫౌండేషన్‌ గత కొన్ని సంవత్సరాలుగా పాపులర్‌ ఆర్టిస్ట్‌లను మెడల్స్‌తో సన్మానిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఫౌండేషన్‌ పాప్‌ క్వీన్‌ షకీరాను ఆర్టిస్ట్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా ఎంపిక చేశారు. ఆమె తన మ్యూజిక్‌తో యూత్‌ ను అలరిస్తుండడంతో పాటు నిర్విహ స్తున్న ఛారిటీ కార్యక్రమాలకుగాను ఆమెను ఫౌండేషన్‌ గుర్తించి ప్రతి ష్టాత్మకమైన మెడల్‌తో సన్మానిస్తోంది.

హార్వర్డ్‌ ఫౌండేషన్‌ ఆన్యువల్‌ కల్చరల్‌ రిథిమ్స్‌ ఫెస్టివల్‌లో భాగంగా ఆమెను సన్మానించనున్నారు. ఈ నెల 26వ తేదీన కేంబ్రిడ్జిలోని హార్వర్డ్‌ యూనివర్సిటీ ష్యాండర్స్‌ థియేటర్‌ లో జరిగే కార్యక్రమంలో షకీరాకు మెడల్‌ను ప్రదానం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టిస్ట్‌లతో పాటు సైంటిస్ట్‌లు, ప్రజా నాయకులను కూడా సన్మానించనున్నారు. ‘షకీరా నేడు ఎంతో పాపులర్‌ సింగర్‌. ఆమె తన హిట్‌ పాటలతో యువతను ఉర్రూతలూగించడమే కాకుండా సేవా కార్యక్రమాల్లో సైతం ఆమె నేడు ఎంతో ముందుంటున్నారు. పేద పిల్లల సంక్షేమం కోసం ఎంతో కృషిచేస్తున్నారు.

ఆమె తన బేర్‌ఫుట్‌ ఫౌండేషన్‌ ద్వారా ఎన్నో ఛారిటీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వీటిని దృష్టిలో పెట్టుకొని షకీరాను ఆర్టిస్ట్‌ ఆఫ్‌ ఇయర్‌గా ఎంపికచేశాము’ అని హార్వర్డ్‌ ఫౌండేషన్‌ డైరెక్టర్‌ ఎస్‌.అలెన్‌ కౌంటర్‌ పేర్కొన్నారు. ఇక షకీరా 18 సంవత్సరాల వయస్సులో బేర్‌ఫుట్‌ ఫౌండేషన్‌ ప్రారంభించారు. దీని ద్వారా ఆరు స్కూ ల్స్‌కు తన వంతు సహాయం చేస్తున్నారు. ఆమె ఫౌండేషన్‌ పిల్లలందరికీ మెరుగైన విద్యను అందించేందుకు కృషిచేస్తోంది. షకీరా 2003 లో యునిసెఫ్‌ గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా సైతం పనిచేశారు.