బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూక్ ఖాన్‌కు వీరాభిమాని ప్రియాంకా చోప్రా. షారూక్‌కు ఆమె ఎంత అభిమాని అంటే అతనితో పలు సినిమాలు చేసినప్పటికీ గతంలో ఏనాడూ అతన్ని పేరు పెట్టి పిలిచిన దాఖలాలు అరుదు. ప్రస్తుతం ఈ అభిమానం కాస్త ఫ్రెండ్‌షిప్‌గా మారడం విశేషం. దీంతో షారూఖ్‌తో కలిసి ప్రియాంకా పలు పార్టీలు, ఫంక్షన్‌లకు హాజరవుతూ సందడి చేస్తున్నారు.
ప్రస్తుతం ప్రియాంకా, షారూఖ్ ఖాన్‌ల మధ్య స్నేహం గురించే బాలీవుడ్‌లో చర్చించుకుంటున్నారు. ఓ టాప్ హీరోతో మరో టాప్ హీరోయిన్ చెట్టాపట్టాలేసుకొని తిరగడం బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం షారూఖ్‌తో కలిసి ప్రియాం కా డాన్ 2 చిత్రంలో నటిస్తున్నారు. దీంతో వీరిద్దరి మధ్య స్నేహం బలపడింది. ఐపిఎల్‌లో షారూఖ్ టీం కోల్‌కతా మ్యాచ్‌ల సందర్భం గా ప్రియాంకా చోప్రా అతనితో కలిసి సందడిచేశారు. చక్కగా పాడే ఈ హీరోయిన్ షారూఖ్ ఇంటికి కూడా వెళ్తూ అక్కడికి వచ్చే గెస్ట్‌లను వివిధ బాలీవుడ్ పాటలతో అలరిస్తున్నట్టు తెలిసింది. డాన్ 2 సినిమా షూటింగ్ కోసం కొంత కాలం బెర్లిన్‌లో కలిసి ఉన్న వీరిద్దరి మధ్య అప్పటి నుంచే మంచి స్నేహం ఏర్పడింది.
పార్టీలు, ఫంక్షన్లలో కలిసి తిరుగడమే కాదు ఖాళీ సమయం లో ఒకరితో ఒకరు నెట్‌లో ఛాటింగ్ చేయడం, కలిసినప్పుడు చదివిన వివిధ పుస్తకాలు, కవితలు, ఫిలాసఫీ పుస్తకాల గురించి చర్చించుకుంటూ కనిపి స్తున్నారు. ప్రియాంకాకు ఐపాడ్‌లంటే ఎంతో ఇష్టం. ఇది తెలుసుకున్న షారూక్ ఆమెకు ఈ మధ్యన కొత్త మోడల్ ఐ పాడ్2ను బహుకరించి ఆమెను మైమరపించారు. ఇక ఐపిఎల్ సందర్భం గా కోల్‌కతా టీం యజమానులైన షారూక్, జూహీ చావ్లాతో కలిసి పలు ప్రాంతాలకు సైతం ప్రియాంకా వెళ్లారు. ఆమె టీంకు ఛీర్‌లీడర్‌గా వ్యవహరిస్తూ ఐపిఎల్‌లో మెరిసారు.‘షారూఖ్ ఖాన్ ఫ్యాన్‌ని నేను. మొదటి నుంచి ఆయన సినిమాలను ఎంతో ఇష్టంగా చూస్తుండేదానిని. పలు సినిమాల్లో కలిసి పనిచేసిన మేమిద్దరం ప్రస్తుతం మంచి స్నేహితులం’ అని ప్రియాంకా పేర్కొన్నారు.