మసాలా
 
 
 
 
తమిళనాట రాణిస్తున్న శర్వానంద్
‘వెన్నెల’, ‘గమ్యం’, ‘ప్రస్థానం’ వంటి హిట్ చిత్రాల ద్వారా... హీరో తెలుగు ప్రేక్షకుల హృదయాలలో మంచి స్థానాన్ని సంపాదించుకున్న యంగ్ హీరో... శర్వానంద్. ఈ హీరో తెలుగులోనే కాకుండా ఇటీవల కోలీవుడ్ లో కూడా తన హవాను చాటుకుంటున్నాడు. ఇటీవలే డైరెక్టర్ మురగదాస్ స్వీయనిర్మాణంలో తెరకెక్కిన ‘ఎంగేయమ్ ఎప్పొదమ్’ చిత్రం తమిళనాట విజయదుందుభి మ్రోగించడంతో... శర్వానంద్ తమిళ్ లోనూ బిజీ హీరోగా మారిపోయాడు. ప్రస్తుతం శర్వానంద్ కి తమిళ బిగ్ డైరెక్టర్స్ నుండి ఆఫర్లు వస్తున్నాయని సమాచారం.

ఈ సందర్భంగా శర్వానంద్ మాట్లాడుతూ - ‘ఎంగేయమ్ ఎప్పొదమ్’ ఒక రసవత్తరమైన ప్రేమ కావ్యం. మురగదాస: మరియు మా డైరెక్టర్ శరవణన్ లు నామీద నమ్మకంతో నన్ను ఈ సినిమాలో హీరోగా తీసుకున్నందుకు వారికి కృతజతలు తెలియజేస్తున్నాను. అలాగే నాతో నటించిన అనన్య మరియు జై, అంజలిలకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ చిత్రం చూసిన తమిళ ప్రేక్షకులు నాపై చూపిస్తున్న అభిమానాన్ని గుండెల్లో దాచుకుంటాను. ఈ చిత్రం ఇచ్చిన స్ఫూర్తితో ఇకపై తెలుగు, తమిళ భాషలకు ప్రధాన్యం ఇచ్చి నటిస్తాను. ప్రస్తుతం వసంతబాలన్, మురగదాస్ ల దర్శకత్వంలో సినిమా చేసేందుకు కథా చర్చల జరుగుతున్నాయి. త్వరలోనే నూతన ప్రాజెక్ట్ లు తెలియజేస్తాను’’ అని తెలిపారు.