మసాలా
 
 
 
 
అందరినీ ఒకేలా ప్రేమిస్తా!
నటిగా ఎలా ఉన్నా నన్ను నేను ఓ వ్యక్తిగా ఇష్టపడతాను. నాకు సెన్సాఫ్ హ్యూమర్ చాలా ఎక్కువ. ఎంత సీరియస్ సిట్యుయేషన్‌లో అయినా నవ్వేస్తాను. చుట్టూ ఉన్నవాళ్లను నవ్విస్తాను. అంతేకాదు, కుల, మత, స్థాయీ భేదాలు లేకుండా అందరినీ ఒకేలా ప్రేమిస్తాను.

పుట్టింది, పెరిగింది, చదివింది... అంతా ముంబైలోనే. నాన్న అలిక్ పదమ్‌సీ, అమ్మ షారన్‌ల గారాల పట్టిని నేను.

మూడేళ్ల క్రితం ‘అన్‌స్పోకెన్ డైలాగ్’ అనే నాటకంలో నటించాను. దానికి నేను నిర్మాతను, నాన్న దర్శకుడు. దాని తర్వాతే నాకు నటనమీద మక్కువ కలిగింది. అంతకుముందు సెవెనప్, నెస్‌కేఫ్, గీతాంజలి జ్యుయెలర్స్ వంటి కొన్ని ప్రముఖ యాడ్స్ చేశాను.

ఓ ఏజెన్సీ ద్వారా నాకు ‘ఆరెంజ్’లో అవకాశం వచ్చింది. అంత మంచి బ్యానర్ ద్వారా తెలుగు పరిశ్రమలో అడుగుపెట్టడం చాలా ఆనందాన్నిచ్చింది. 2009లో రణబీర్‌కపూర్‌తో ‘రాకెట్‌సింగ్’లో నటించాను. ‘ఆరెంజ్’ నా రెండో సినిమా.

కథలు, నాటకాలు లాంటివి రాయడం చాలా ఇష్టం. అప్పుడప్పుడూ రాస్తూ ఉంటాను. నటిని కనుక కాకపోయి ఉంటే కచ్చితంగా రచయిత్రిని అయ్యేదాన్ని.

నటికి మంచి ఫిజిక్ చాలా అవసరం. నేనేమో భోజనప్రియురాలిని. చాన్‌‌స దొరికితే రకరకాల వంటకాలు లాగించేస్తా. తర్వాత ఆ క్యాలరీలన్నీ కరగడానికి జిమ్ చేస్తా. ఎప్పుడూ అలాగే జరుగుతూ ఉంటుంది.

నటిగా కాజోల్ నా రోల్‌మోడల్. తన నటన, హావభావాలు అద్భుతంగా ఉంటాయి. వ్యక్తిగా ఐశ్వర్యారాయ్‌ని రోల్‌మోడల్‌గా అనుకుంటాను. ఆవిడ వ్యక్తిత్వం, టాలెంట్, కెరీర్‌ను మలచుకున్న తీరును ఆదర్శంగా తీసుకుంటాను.

ప్రస్తుతం మధుర్ భండార్కర్ దర్శకత్వం వహిస్తున్న ‘దిల్‌తో బచ్చాహై జీ’లో నటిస్తున్నాను. అజయ్ దేవ్‌గన్ హీరో. ఆ చిత్రం నాకు మంచి పేరు తెచ్చిపెడుతుందని అనుకుంటున్నాను.