Bookmark and Share   Cinevinodam
Subscribe
 
 
లంగా ఓణి అంటే షీలాకు బోర్

      ‘సీతాకోక చిలుక’, ‘రాజూభాయ్’, ‘పరుగు’... ఇలా ప్రతి సినిమాలోనూ లంగా ఓణీలు వేసుకునే పాత్ర చేసిచేసి బోర్ కొడుతోంది. ఆ సినిమాల తర్వాత ఈ లంగా ఓణీటైపు కథలు కనీసం వంద విన్నాను. వ్యక్తిగతంగా నాకు మోడ్రన్ గా వుండటం అంటే ఇష్టం. అందుకని, ఇలా లంగా ఓణీ పాత్రలు ఎన్నళ్ళని చేయగలను. ఆ ఇమేజ్ నుండి బయటికి రావడం కోసం ఎన్నో మంచి అవకాశాలను వదులుకున్నాను. ‘మస్కా’ కోసం ఎమ్మెస్ రాజు ఫోన్ చేసి గ్లామర్ పాత్ర అనేసరికి ఎగిరి గంతేశాను. కాస్త ఆలస్యం అయినా, మనకి కావాల్సిన దానికోసం వేచిచూస్తే విజయం సాధిస్తాం. ఆ తర్వాత ‘అదుర్స్’తో నా గురించి అంతవరకూ వున్న ఇమేజ్ మొత్తం మారిపోయింది- అంటూ చెబుతోంది నటి షీలా.

భరత్, సంధ్య చేసిన ‘ప్రేమిస్తే’లో నాయిక పాత్ర మొదట నాకే ఆఫర్ వచ్చింది. కనీసం టెన్త్ పూర్తి కాకుండా సినిమాలు చేయడం అమ్మకి ఇష్టం లేదు. ఆ తర్వాత ‘కణ్ణా’ అనే ఆర్ట్ చిత్రంలో అవకాశం వచ్చింది. ఆ దర్శకుడు పట్టువదల కుండా తిరిగి అమ్మను ఒప్పించాడు. దాంతో హీరోయిన్ ని అయిపోయాను. ‘సీతాకోక చిలుక’ తమిళ్, తెలుగులో చేయడంతో క్రమంగా సినిమాలు రావడంతో అమ్మ కూడా రాజీ పడిపోయింది- అంటూ చెబుతోంది షీలా. హీరోయిన్ కాకముందు పలు చిత్రాల్లో బాలనటిగా చేసిన షీలా... మణిరత్నం వంటి ప్రముఖ దర్శకుడి ప్రశంసలు కూడా అందుకుంది.

 
 

Copy right reserved for www.cinevinodam.com 2005