మసాలా
 
 
 
 
పెద్ద విలన్ గా పేరు తెచ్చుకోవాలి
బిజినెస్‌ కుటుంబంలో పుట్టి...అదే రంగంలో విద్యనభ్యసించినా..ఏదో తెలియని వెలితి, అసంతృప్తి! కొత్తగా ఏదైనా చేయాలని తలచి నటనారం గంలోకి వచ్చాను. నాకు నచ్చిన విలన్‌ ప్రకాష్‌రాజ్‌. తన నటనంటే చాలా ఇష్టం. అందుేక ఆయనలానే పెద్ద విలన్‌గా పేరు తెచ్చు కోవాలనుంది. తెలుగులో నా రెండో సినిమా ‘దడ’ మంచి గుర్తింపు తెచ్చింది’’ అన్నారు విలన్‌ జునైద్‌ షేక్‌. నాగచైతన్య ‘దడ’లో ప్రతినాయ కుడిగా మెప్పించిన జునైద్‌ చెప్పిన సంగతులివి...

నటశిక్షణ తర్వాత నేను నటించిన తొలిసినిమా ‘పప్పు’. వినాయకుడు ఆ చిత్రంలో హీరో. నాగచైతన్యతో రెండో సినిమా ‘దడ’ విలన్‌గా తెలుగు ప్రేక్షకుల్లో మంచి పేరుతెచ్చింది. అజయ్‌భుయాన్‌ క్లాస్‌గా తెరకెక్కించారు. తెలివైన దర్శకుడు తను. మరో భారీ చిత్రానికి ప్రస్తుతం సన్నాహాలు చేస్తున్నారు. మహేష్‌ ‘దూకుడు’ 3వ సినిమా. ఇందులో సోనూసూద్‌ ప్రధానవిలన్‌. నేను రెండోవిలన్‌గా చేస్తున్నా. మహేష్‌తో కొన్ని ఫైట్‌ సీక్వెన్సుల్లో కనిపిస్తాను.

శ్రీనువైట్ల చాకచక్యంగా ఆ సినిమాని తెరకెక్కిస్తున్నారు. తమిళంలోనూ విజయ్‌ హీరోగా దీపావళికి వస్తున్న ‘వేలాయుధం’లో విలన్‌గా నటించాను. ఇవేగాక తెలుగులో ఓ రెండు సినిమాల్లో హీరోగా నటించనున్నా. ‘అరుంధతి’లో సోనూసూద్‌ చేసిన పాత్ర..నా డ్రీమ్‌రోల్‌. అలాంటి పాత్రలో చేయాలి. అలాగే బాలీవుడ్‌లో మమేష్‌భట్‌ సంస్థలో ఓ సినిమా చేస్తున్నా. నవంబర్‌లో సెట్స్‌కెళుతున్నాం.

మగధీర, కందిరీగ, పోకిరి... తెలుగులో నాకు నచ్చిన సినిమాలు. పూరిజగన్నాథ్‌, రాజమౌళి, వి.వి.వినాయక్‌ సహా పెద్ద దర్శకులందరి సినిమాల్లో నటించాలనుంది. నా స్వస్థలం జమ్మూ కాశ్మీర్‌. నటన ఆశయంగా ముంబైకొచ్చా. అక్కడ థియేటర్‌ అనుభవం గడించాను. నటన, వ్యాయామం ఇష్టం. నా నిత్యకృత్యాలవి.