Bookmark and Share   Cinevinodam
Subscribe
 
 
షెర్లిన్‌చోప్రా ‘‘బికినీ స్టూడియో’’

     "పట్టు చీర కట్టుకుని ఈతకొలనులో దూకలేం కదా... అలాగే ఈత దుస్తులు వేసుకుని గుడికి వెళ్లలేంగా..?' ఈ మాటలు ఈత దుస్తులు వేసుకుని నటించిన తారలు అంటూ ఉంటారు. ముఖ్యంగా సినిమాల్లోనే కాకుండా విడిగా కూడా బికినీ ధరించి సంచలనం సృష్టించే షెర్లిన్‌ చోప్రా.. "సౌకర్యవంతంగా ఉన్నప్పుడు వేసుకుంటే తప్పేంటి?' అని నిర్మొహమాటంగా అంటారు. ఇదిలా వుండగా ఇప్పుడు ఏకంగా 'బికినీ స్టూడియో' ఆరంభించడానికి ఆమె సన్నాహాలు చేస్తున్నారట. దీనికోసం ఆమె కొంతమంది ప్రొఫెషనల్‌ డిజైనర్స్‌ను పనికి కుదుర్చుకున్నారట.

ఈ స్టూడియో గురించి షెర్లిన్‌ చెబుతూ - "మామూలుగా స్లిమ్‌గా ఉండేవారిని 'హవర్‌గ్లార్‌ ఫిగర్‌' అంటారు. ఇటువంటివాళ్లకు బికినీలు బాగా నప్పుతాయి. అయితే లావుగా ఉండేవారికి కూడా రకరకాల దుస్తులు ధరించాలని, హాయిగా ఈత కొడుతున్నప్పుడు బికినీ ధరించాలని ఉంటుంది. అలాంటివారి కోసం కూడా ప్రత్యేకంగా ఈత దస్తులు తయారు చేయిస్తున్నాను. జీరో సైజ్‌ నుంచి బడా సైజ్‌ వరకు ... ఎవరికైనా మా వద్ద బికినీలు ధరిస్తాయి.

కాబట్టి నా బికినీ స్టూడియో బాగా పాపులర్‌ అవుతుందనే నమ్మకం ఉంది. కేవలం ఈతదుస్తులు మాత్రమే లభించే షాప్స్‌ చాలా తక్కువగా ఉంటాయి. ముంబయ్‌లో ఓ ప్రముఖ ఏరియాలో షాప్‌ ఆరంభించడానికి సర్వం సిద్ధం చేసుకుంటున్నాను' అంటున్నారు. షెర్లిన్‌ చోప్రా ఏం చేసినా సంచలనంగానే ఉంటుంది. ఆ మధ్య ఓ ప్రైవేట్‌ ఆల్బమ్‌లోను రూపొందించి, నటించారామె. ఆ ఆల్బమ్‌లో నటించడానికి ఆమె వజ్రాలు పొదిగిన బికినీ ధరించారు. అనంతరం ఆల్బమ్‌ ప్రమోషన్‌లో భాగంగా ఆ బికినీ ధరించి పబ్లిక్‌లో తిరిగారు. ఏమైనా ఇప్పుడు బికినీ స్టూడియో ఆరంభించడానికి ఆమె సన్నాహాలు చేయడం ముంబయ్‌లో హాట్‌ టాపిక్‌ అయ్యింది.

 
 

Copy right reserved for www.cinevinodam.com 2005