మసాలా
 
 
 
 
శివాజీ-రీతు కౌర్ -మనోహర్ ల చిత్రం

శివాజీ, రీతూకౌర్ జంటగా మనోహర్ చిమ్మని దర్శకత్వంలో శ్రీలక్ష్మీనరసింహ అంజిత ఫిలింస్ - ఆర్.ఆర్,.రియల్టర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఇంకా పేరు పెట్టని చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 20 నుంచి ఆరంభం కానుంది. ఆనందరావు - కె.జె.దశరథ్ - అమరనాధరెడ్డి సహ నిర్మాతలుగా కృష్ణ - డి.ఆర్. రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 18 మంచి ప్రముఖ నటీనటులు హాస్య తారాగణంతో పూర్తి స్థాయి వినోదభరిత చిత్రంగా ఈ చిత్రాన్ని రూపొందించనున్నామని దర్శకులు మనోహర్ చిమ్మని చెబుతున్నారు. శివాజీ గత చిత్రాలతో పోలిస్తే ఈ చిత్రం టేకింగ్ చాలా కొత్తగా, విభిన్నంగా వుంటుందని కూడా ఆయన అంటున్నారు. ‘మొదటి సినిమా, దొంగలబండి’ వంచి చిత్రాలకు సంగీతాన్ని సమకూర్చిన స్వరాజ్ హెడిడె సంగీత సారథ్యం వహిస్తున్న ఈ చిత్రంలో ఐటం సాంగ్ సహా ఐదు పాటలుంటాయి. సింగిల్ షెడ్యూల్ లో షూటింగ్ పూర్తి చేసుకోనున్న ఈ చిత్రంలో ‘హంగామా’ జ్యోతి, ‘అల్లరి’ సుభాషిణి, మహేశ్వరి, ‘చిత్రం’ శీను, తాగుబోతు రమేష్, ఆర్ కె, ధనరాజ్, పృథ్వీరాజ్, సూర్య, లాప్ టాప్ తడివేలు, టార్జాన్, చరణ్, షాని ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా : జగదీష్, ఆర్ట్ : విజయకృష్ణ, ఫైట్స్ : బాచి, సంగీతం : స్వరాజ్ హెడిడె, సహ నిర్మాతలు : ఆనందరావు, కెజె దశరథ్, అమరనాథరెడ్డి, నిర్మాతలు : ఎస్,ఎస్. కృష్ణ, డి.ఆర్.రెడ్డి, రచన-దర్శకత్వం : మనోహర్ చిమ్మని.