Bookmark and Share   Cinevinodam
Subscribe
 
 
ఐశ్వర్య ‘నో’ - నేను ‘ఓకె’

      'శివాజీ'లో పాత్రకు నాకు అంత మంచి పేరు వస్తుందని అనుకోలేదు. అందరూ మెచ్చుకుంటుంటే చాలా సంతోషపడ్డాను. అసలు ఆ పాత్ర ఐశ్వర్యారాయ్‌ చెయ్యాలి. తను కాదనటంతో నాకు దక్కింది. ఆ సినిమా నాకో మంచి అనుభూతిని మిగి ల్చింది. థాంక్స్‌ టు ఐశ్వర్యారాయ్‌!

రజనీ సర్‌ని చూస్తే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. కెమెరా ముందు ఆయనో స్టార్‌. మేకప్‌ తీయ గానే కొత్త వ్యక్తిలా ఉంటారు. ఆయనలా ఉండటం కష్టం. తన పనేదో తాను చేసుకుపోతారు. ఆయన నాకు ఒకే విషయం చెప్పారు-మనం ఎంత ఎదిగినా మూలాల్ని మర్చిపోకూడదు అని. ఆ మాట ఎప్పటికీ మర్చిపోను.

తెలుగులో అవకాశాలు తగ్గాయేంటని అడుగుతున్నారు. అవకాశాలు తగ్గలేదు. నాకు నచ్చిన పాత్రలు దొరక ట్లేదు. తమిళ, మలయాళ సినిమాల్లో మంచి పాత్రలు వచ్చాయి. అందుకే అవి చేస్తున్నాను. ప్రస్తుతం పవన్‌కళ్యాణ్‌ 'కొమరం పులి'లో ఓ ప్రత్యేక పాత్ర చేస్తున్నాను. నాకు తగ్గ అవ కాశాలు వస్తే తెలుగులోనూ నటిస్తా.

నాకు తెలుగు బాగానే వచ్చు. కాకపోతే గ్రామర్‌ తప్పులు ఉంటాయి. దాంతో నేను మాట్లాడేటప్పుడు కొంతమంది నవ్వేస్తూ ఉంటారు. అందుకే మాట్లాడను. ఎవరైనా నవ్వితే నాకు నచ్చదు.

నా ఐదేళ్లప్పుడు నన్ను తీసుకుని అమ్మ జైపూర్‌లోని బిర్లా టెంపుల్‌కి వెళ్లిందట. అమ్మ పూజలు చేస్తున్నప్పుడు నేను సడెన్‌గా మిస్సయ్యానట. తను నా కోసం వెతుకుతుంటే ఓ పెద్ద గుంపు కనపడిందట. అక్కడికి వచ్చి చూస్తే కొందరు డప్పులు కొడుతుంటే, ఆ శబ్దానికి అనుగుణంగా నేను డ్యాన్స్‌ చేస్తూ కనపడ్డానట! నా డ్యాన్స్‌ చూడటానికే అందరూ గుమిగూడారని తెలుసుకుని అమ్మ ఆశ్చర్యపోయిందట. నేనో మంచి డ్యాన్సర్‌ని అవుతానని తను ఆ క్షణమే నిర్ణయించుకుందట.

నటిని కావాలని ఎప్పుడూ అనుకోలేదు. మంచి కథక్‌ డాన్సర్‌ని కావాలనుకున్నాను. శోభానారాయణ్‌ దగ్గర కథక్‌ నేర్చుకుంటూ వర్క్‌షాప్స్‌లో పాల్గొన్నాను. అప్పుడే కొన్ని మ్యూజిక్‌ వీడియోస్‌లో నటించే అవకాశం వచ్చింది. ఆ వీడియోలు చూసి డైరెక్టర్లు విక్రమ్‌కుమార్‌, రాజ్‌కుమార్‌ 'ఇష్టం'లో అవకాశం ఇచ్చారు.

అదృష్టంకొద్దీ అందంతో, ఆరోగ్యకరమైన శరీరంతో పుట్టాను. దాన్ని కాపాడుకోవటంపై చాలా శ్రద్ధ పెడతాను. ఐస్‌క్రీమ్స్‌, స్వీట్స్‌ తినను. రోజూ పొద్దున్నే యోగా చేస్తాను. ఫిట్‌నెస్‌ను ఎలా కాపాడుకోవాలో నాకు మా అమ్మే చెబుతుంది.

పెర్‌ఫార్మెన్స్‌కి అవకాశమున్న పాత్రలు చేయాలన్నదే మొదటినుంచీ నా కోరిక. ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటి అవకాశాలు రావటం కష్టమే. ప్రతి సిని మాలోనూ హీరోకే పెద్దపీట వేస్తారు.

 
 

Copy right reserved for www.cinevinodam.com 2005