Bookmark and Share   Cinevinodam
Subscribe
 
 
ఎటు తిప్పితే అటు...

      శ్రియ నటించిన చిత్రాలు హిట్‌ కాకపోయినా ఆమెకున్న క్రేజ్‌ ఏ మాత్రం తగ్గక పోవడం విశేషం. ప్రస్తుతం తమిళంలో 'కుట్టి', 'జగ్గుబాయ్‌', 'చిక్కుబుక్కు' చిత్రాల్లో నటిస్తోంది. తాజాగా మలయాళంలోనూ ఓ చిత్రంలో నటించేందుకు అంగీకరించిన శ్రియతో చిట్‌ చాట్‌...

గ్లామర్‌ రహస్యం
సినిమాతారగా రాణించాలంటే గ్లామర్‌ని పదిలంగా కాపాడుకోవలిసిందే. అందులో భాగంగా నేను వివిధ రకాల ఎక్సర్‌సైజులు చేస్తుంటాను. అది కూడా రొటీన్‌గా ఒకటే చేయను. వారంలో మూడురోజుల పాటు కార్డియో ఎక్సర్‌సైజ్‌ చేస్తాను. మరో మూడు రోజులు స్విమ్మింగ్‌ చేస్తాను. అలాగే ప్రతిరోజూ దాదాపు అరగంటకు పైగా యోగా చేస్తాను. యోగా అనంతరం ధ్యానం కూడా చేస్తాను. దానితో శరీరంతో పాటు మనస్సెంతో ఉల్లాసంగా ఉంటుంది. ఇంతకన్నా మరే రహస్యం లేదు!

ఆహార నియమాలు
ఇంట్లో ఉన్నసమయంలో డైట్‌ కంట్రోల్‌ చేయడానికి, అంటే ఆహార నియమాలు పాటిచడానికి ఎక్కువ వీలు కలుగుతుంది. అదే షూటింగ్‌ల్లో పాల్గొంటూ వివిధ ప్రాంతాలకు వెళ్తుండటం వల్ల ఇబ్బందిని ఎదుర్కోవలసి వస్తోంది. ఇంట్లో ఉంటే ఆరెంజ్‌ జ్యూస్‌, ఆమ్లెట్‌, పనీర్‌ పరాఠా, శెనగలతో చేసిన కట్‌ లైట్‌, వంటిని తీసుకుంటాను. అదీ ఒకేసారిగా తినను విరామాన్ని ఎక్కువగా పాటిస్తాను. అలాగే ప్రయాణంలో ఉన్నప్పుడు గ్రిల్డ్‌ ఫిష్‌, చికెన్‌ తీసుకుంటాను. చాక్లెట్లు అంటే పడిచస్తాను. నా ఫ్రిజ్‌ మొత్తం వివిధ రకాల చాక్లెట్స్‌తో నిండి ఉంటుంది.

తీరిక సమయాల్లో...
నాకు సంగీతమంటే చాలా ఇష్టం. ఏమాత్రం టైమ్‌ దొరికినా సంగీతం వింటాను. అలాగే గాన్స్‌, స్విమ్మింగ్‌, యోగా వంటివి చేస్తుంటాను. మరీ రిలాక్స్‌గా ఉన్నప్పుడు నా మేనల్లుడుతో ఆడుకుంటాను.

ఎక్స్‌పోజింగ్‌ అంటే...
'పిస్తా' చిత్రంలోను, 'మల్లన్న' చిత్రంలోనూ నేను బాగా ఎక్స్‌పోజింగ్‌ చేసానని మీడియా వక్రీకరించింది. కథ డిమాండ్‌ మేరకే నేను నటించాను తప్ప... అందులో ఎ్కడా వల్గర్‌గా కనిపించలేదు. ఈ రెండు చిత్రాల్లోనూ నేను ఎంతో అందంగా కనిపించానని అందరూ అంటుంటారు.

భవిష్యత్తు ప్రణాళికలు
ఇప్పటి వరకు నేను ఇలా ఉండాలి అంటూ ఎలాంటి ప్లాన్‌ చేసుకోలేదు. వచ్చిన సినిమాల్ని అంగీకరిస్తూ వస్తున్నాను. జీవితం ఎటు మలుపు తిప్పితే అటు వెళ్లడమే నా పని.

 
 

Copy right reserved for www.cinevinodam.com 2005