ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన విలక్షణ నటుడు కమల్ హాసన్ తనయురాలు శృతి హాసన్. ఈ అందాల తార నేడు సినీ
యాక్టర్‌గానే కాకుండా సింగర్‌గా సైతం పాపులారిటీ సంపాదిస్తోంది. ఈ సినీతార ఇటీవల కొత్త అవతారం ఎత్తి
వెల్వెట్ రివాల్వర్ అనే ఇంటర్నేషనల్ బ్యాండ్‌కు లిరిక్స్ రాయడమే గా కుండా పాటలు పాడి అంతర్జాతీయ
గుర్తింపు సాధించింది. రాక్ స్టార్ డేవిడ్ కుష్నర్‌కు చెందిన వెల్వెట్ రివాల్వర్ బ్యాండ్‌తో కలిసి శృతి పని చేసింది.
ఈ రాక్ బ్యాండ్‌తో కలిసి పనిచేసిన అను భవాలను గురించి శృతి హాసన్ మాట్లాడుతూ ‘ప్రపంచ
ప్రఖ్యాతిగాం చిన రాక్ ఐకాన్ డేవిడ్ కుష్నర్‌కు చెందిన బ్యాండ్ వెల్వెట్ రావా ల్వర్. ఈ బ్యాండ్‌కు లిరిక్స్
రాయడమే కాకుండా డేవిడ్‌తో కలిసి కొన్ని పాట లు పాడడం మరచిపో లేని అనుభూతి. దీంతో ఇంటర్నేషనల్
బ్యాండ్‌తో కలిసి పనిచేయాలన్న నా కల నేరవేరినట్ట య్యింది. రాక్ సింగర్‌గా, సాంగ్ రైటర్‌గా, మ్యూజీషియన్‌గా
ఈ బ్యాండ్‌కు పని చేయడం ఆనందంగా ఉంది’ అని శృతి పేర్కొంది.
ఇక ఈ బ్యాండ్‌కు పనిచేసేందుకు ఎలా అవకాశం వచ్చిందనే విషయంపై మాట్లాడుతూ ‘చెనై్న
లో స్కూల్లో చదువుకుంటున్న రోజుల్లోనే ఇంగ్లీష్ లిరిక్స్ రాయడం నాకు అలవాటు. వెస్టర్న్ పాటలను రాస్తూ
స్కూల్లో తోటి విద్యార్థులు, ఉపాధ్యాయుల ప్రశంసల నందుకున్నాను. చిన్నప్పటి నుంచి లెజెండరీ సింగర్, సాంగ్
రైటర్, మ్యూజీషియన్ బాబ్ డైలాన్ నా రోల్ మోడల్, హీరో. ఆయన్ని ఆద ర్శంగా తీసుకొని మ్యూజిక్‌లో ఆల్
రౌండర్‌గా పేరుతెచ్చుకో వాలని కలలు కనేదాన్ని. ఈ నేపథ్యంలో లాస్ ఏంజిల్స్‌లోని నా ఫ్రెండ్ ఒకరు నన్ను
వెల్వెట్ రావాల్వర్ బ్యాం డ్‌కు చెందిన డేవిడ్ కుష్నర్‌ను కలిపించారు. ఆయన తన బ్యాండ్ కోసం ఓ కొత్త ఫిమేల్
సింగర్, సాంగ్ రైటర్ గురించి వెతుకుతున్నారు.
ఇంతలో అతన్ని కలవడంతో వెంటనే డేవిడ్ నాకు తన కొత్త ఆల్బమ్ కోసం లిరిక్స్ రాయడమేగాకుండా తన తో
కలిసి పాటలు పాడే అవకాశాన్ని కల్పించారు’ అని ఆమె ఆనందంగా వెల్ల డించింది. ‘ప్రస్తుతం పలు సినిమాల్లో
చేయడంతో పాటు ఇంటర్నేషనల్ రాక్ బ్యాండ్‌కు పనిచేయడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. ఇక సినిమాల్లో
పాటలు పాడడం గురించి ఇప్పుడే ఆలోచించడం లేదు’ అని శృతి హాసన్ పేర్కొంది.