తన భర్త అనుమతితోనే శృంగారాత్మక చిత్రాల్లో నటిస్తున్నట్లు శ్వేతామీనన్ వెల్లడించారు. మలయాళంలో పలు శృంగారాత్మక చిత్రాల్లో ఈ కేరళ కుట్టి
నటించారు. ప్రస్తుతం తమిళంలో అరవాన్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సందర్భంగా ఈ శ్వేతామీనన్‌తో చిన్న భేటీ..
ప్ర: ఎక్కువగా శృంగారాత్మక చిత్రాల్లోనే నటిస్తున్నట్లున్నారు?
జ : నటన అనేది ఒక వృత్తి. పాత్రకు శృంగారం అవసరం. అయితే అందుకు తగ్గట్టుగా నటించడంలో తప్పులేదు.
ప్ర: రతి నిర్వేదం చిత్రంలో శృంగారం శృతిమించిందనే విమర్శల గురించి
ఏమంటారు?
జ : రతి నిర్వేదం గతంలో ఇదే పేరుతో వచ్చిన చిత్రానికి రీమేక్. ఆ చిత్రం చూస్తే ఇలాంటి విమర్శలు ప్రచారమై ఉండేవికావు. అయినా ఆ చిత్రంలో అసభ్య
సన్నివేశాలేమీ లేవు.
ప్ర: ఈ తరహా పాత్రల విషయంలో మీ భర్త అభిప్రాయం?
జ : నా భర్త పేరు శ్రీనివాస్ మీనన్. ఏడాదిన్నర క్రితమే మా పెళ్లైంది. ముందే చెప్పినట్లుగా నటన అనేది వృత్తి మాత్రమే. అందులో సాధారణ వేషం, శృంగార
పాత్ర అనే తారతమ్యం లేదు. ఈ విషయంలో నా, నా భర్త అభిప్రాయం ఒకటే. పెళ్లయిన తర్వాతా నేను నటనను కొనసాగించడం వెనుక ఆయన సహకారం
ఎంతో ఉంది. నా ఎదుగుదలకు నా భర్త ఎంతగానో తోడ్పడుతున్నారు.
ప్ర: సంసార జీవితానికి నటన ప్రతిబంధకం కావడం లేదా?
జ : ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లో విజయం సాధిస్తున్నారు. నేను నటన, కుటుంబంపై సమాన శ్రద్ధ చూపుతున్నాను. ఎంత సమయాన్ని
కుటుంబానికి కేటాయించామన్నది కాకుండా వారికి ఎంత వరకు ఉపయోగపడుతున్నాం అన్నది ముఖ్యం. ఆ విధంగా నేను రెండు బాధ్యతలను సక్రమంగా
నిర్వర్తిస్తున్నాను.