మసాలా
 
 
 
 
రెండో పెళ్లికి రెడీ
సిద్దార్థ్ రెండో పెళ్లికి సిద్ధం అవుతున్నారు. బాయ్స్ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయమైన ఈ క్రేజీ హీరో టాలీవుడ్‌పై దృష్టి సారించారు. తెలుగులో నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు వంటి పలు చిత్రాలు విజయం సాధించాయి. ఇటీవల 180 చిత్రం ద్వారా కోలీవుడ్‌కొచ్చిన సిద్దార్థ్ కాదలిల్ సొదప్పువదు ఎప్పడి చిత్రంలో నటిస్తున్నారు. ఆయనతో చిన్న భేటీ...

ఇకపై తెలుగు చిత్రాల్లోనే నటిస్తానని ప్రకటించారట?
అది అవాస్తవం. అలా నేనెప్పుడూ, ఎక్కడా చెప్పలేదు. నటుడికి భాష ముఖ్యం కాదు.

ప్రస్తుతం తమిళంలో చేస్తున్న చిత్రాలు?
కాదలిల్ సొదప్పువదు ఎప్పడి చిత్రంతోపాటు గణిత శాస్త్ర మేధావి రామానుజన్ జీవిత చరిత్రతో తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తున్నాను. నేను చిత్ర పరిశ్రమలోకి వచ్చి 11 ఏళ్లు అయ్యింది. ఈ ఏడాది నాకు చాలా విశేషమైంది.

రెండో పెళ్లి చేసుకోబోతున్నారా?
మీరీ ప్రశ్న వేస్తారని తెలుసు. విశే షమేమిటనేది నెల తర్వాత చెబుతా.

చాలా సంతోషంగా ఉన్నట్లున్నారు?
అవును. చాలా హ్యాపీగా ఉన్నాను. నేను తెలుగులో నటిం చిన ఓ మై ఫ్రెండ్ ప్రజాదరణ పొందింది. కాగా సిద్దార్థ్ 2003లో తన గర్ల్‌ఫ్రెండ్ మేగ్నాను పెళ్లి చేసుకున్నారు. 2006లో విడాకులు పొందారు. ఈ మధ్య నటి శృతిహాసన్‌తో ప్రేమ వ్యవహారం నడుపుతున్నట్లు వదంతులు కూడా ప్రచారం అయ్యాయి.