మసాలా
 
 
 
 
సినిమాల్లోనూ అక్క చెల్లెళ్ళ అనుబంధం
వారసత్వం హీరోలకే కాదు సినీ హీరోయిన్లకు కూడా ఉంటుంది. అదే వారసత్వంతో తెరపైకి గతంలో హీరోయిన్లుగా చాలామందే వచ్చారు. ఇప్పుడూ వస్తునే ఉన్నారు. అయితే వీళ్లలో చెల్లెళ్లుగా రాణించినవాళ్లను వేళ్లమీద లెక్కపెట్టుకోవచ్చు. పాతతరం వాళ్లలో షావుకారుజానకి, కృష్ణకుమారి ఇద్దరూ బాగానే రాణించారు. తర్వాత జయసుధ చెల్లెలు, భానుప్రియ చెల్లెళ్లు చెల్లని నాణాలుగా మిగిలిపోయారు.ఆ మధ్య ఆర్తఇగర్వాల్‌-అదితి అగర్వాల్‌, కాజల్‌ చెల్లెలు నిషాఅగర్వాల్‌లుకూడా రేసులో వెనకబడిపోయారు.ఇప్పుడు కొత్తగా ‘సూపర్‌’ సినిమాలో నటించిన ఆయేషాటకియా-నటాషాటకియా రంగప్రవేశం చేయనుంది.

తెలుగులో నాగచైతన్య నటించే కొత్త సినిమాలో నటిస్తున్నట్లు భోగట్టా. బాలీవుడ్‌లో మాత్రం ఇందుకు భిన్నంగా కరిష్మా- కరీనాకపూర్‌ ఓ రేంజ్‌లో రాణిస్తోంది. ఇప్పుడు కొత్తగా కత్రినాకైఫ్‌ చెల్లెలు ఇసబెల్లాకైఫ్‌ కూడా సినిమాల్లో నటించేందుకు ఉత్సాహం చూపిస్తోంది. ఇప్పటికే శిల్పశెట్టి- నమితశెట్టి, అమృత,మలైకాఅరోరా,అమృతారావు, ప్రీతీరావులు బాలీవుడ్‌లో అడుగుపెట్టినా చెల్లెళ్ల స్థాయిలోనే రెండోస్థానంలో ఉన్నారు. మరి కొత్తగా వచ్చే చెల్లెళ్లు ఏరకంగా రాణిస్తారో...అక్కలపై ఆధిపత్యం చెలాయిస్తారో వేచిచూడాలి...