లార్స్‌కో ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై మధుర శ్రీధర్‌రెడ్డిని దర్శకునిగా పరిచయం చేస్తూ నూతన నటీనటులతో ప్రముఖ
నిర్మాత లగడపాటి శ్రీధర్ నిర్మించిన ‘స్నేహగీతం’ విజయపథంలో దూసుకెళుతూ 50 రోజులవైపు పరిగెడుతున్న
సంగతి విదితమే. ఈ సినిమాను ఎందరో ప్రముఖులు ప్రశంసిస్తున్న నేపథ్యంలో సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్‌వర్మ కూడా
చిత్రం టీమ్‌కు అభినందనలు తెలిపారు. ‘కొత్త తారాగణం, కొత్త కథతో ఎంతో ఫ్యాషన్‌తో కొత్త దర్శకుడు మధుర
శ్రీధర్‌రెడ్డి ఎంతో నిజాయితీగా సినిమా తీసినందుకు నా అభినందనల. ముందుముందు వీళ్లు చేయబోయే ప్రయాణా నికి
నా శభాశీస్సులు’ అని రామ్‌గోపాల్‌వర్మ అన్నారు. మధుర శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ ‘నేను ఇంజ నీరింగ్
చదువుతున్న రోజుల్లో ‘శివ’ సినిమా చూసి దర్శకుడ్ని కావాలని ఫిక్సయిపోయాను.
ఆయనకు నేను ఏకలవ్య శిష్యుడ్ని. నా ద్రోణాచార్యులు రామ్‌గోపాల్‌వర్మ. ఆయన మా ‘స్నేహగీతం’
మెచ్చుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇది నా జీవితంలో మరిచిపోలేని రోజు’ అన్నారు. నిర్మాత లగడపాటి శ్రీధర్
మాట్లాడుతూ ‘హృదయాన్ని అనుసరించు-ప్రపంచాన్ని జయించు’ అన్నది స్నేహ గీతం థీమ్. దీనికి కచ్చితమైన
ఉదాహరణ రామ్‌గోపాల్‌వర్మ. ఆయన మా సినిమాకు అభినందనలు తెలపడం చాలా గర్వంగా ఉంది’ అన్నారు. ఈ
సమావేశంలో చిత్ర హీరోలు వెంకీ, సందీప్, మరియు హీరోయిన్ శ్రేయ ధన్వంతరీ పాల్గొన్నారు.
|