Bookmark and Share   Cinevinodam
Subscribe
 
 
టాలీవుడ్డే సో బెటర్

      ఐశ్వర్యరాయ్‌ పోలికలతో ఉన్న స్నేహా ఉల్లాల్‌ని 'లక్కీ: - నో టైమ్‌ ఫర్‌ లవ్‌' అనే హిందీ చిత్రం ద్వారా కథానాయికగా పరిచయం చేశారు కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌. ఆ తర్వాత హిందీలో రెండు సినిమాలు చేసిన ఉల్లాల్‌ 'ఉల్లాసంగా ఉత్సాహంగా' చిత్రం ద్వారా తెలుగు పరిశ్రమలో అడుగుపెట్టారు. తొలి చిత్రంతోనే టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో తెలుగులో ఆమెకు వరుసగా అవకాశాలు వచ్చాయి. దాంతో బాలీవుడ్‌వైపు వెళ్లలేదు.

కొంత గ్యాప్‌ తర్వాత 'క్లిక్‌' అనే హిందీ చిత్రంలో నటించారామె. బాలీవుడ్‌లో స్నేహా ఉల్లాల్‌కి ఇది సెకండ్‌ ఇన్నింగ్స్‌ అంటున్నారు. కానీ ఆమె మాత్రం ఆ మాటతో ఏకీభవించడంలేదు. 'క్లిక్‌' చిత్రం తన చుట్టూ తిరగదని, అందుకని ఈ చిత్రంతో సెకండ్‌ ఇన్నింగ్స్‌ ఆరంభించాననడం కరెక్ట్‌ కాదని స్నేహా ఉల్లాల్‌ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే హిందీ రంగంలో తనని చాలామంది తప్పుదోవ పట్టించారని ఆమె ఆరోపిస్తున్నారు. నమ్మినవాళ్లే మోసం చేశారట.

అయితే తెలుగు పరిశ్రమ అలా కాదని చెబుతూ - "ఉత్తరాది నుంచి వచ్చినప్పటికీ దక్షిణాదిన నాకు మంచి ఆదరణ లభించింది. 'ఉల్లాసంగా ఉత్సాహంగా' తర్వాత నాకు వరుసగా అవకాశాలు వస్తున్నాయి. ఓ తెలుగు సినిమాలో అభ్యంతరకరంగా అనిపించే ముద్దు సన్నివేశం ఉండటంవల్ల ఆ సినిమాని నేను తిరస్కరించాను. ఆ తర్వాత వేరే సినిమాకి అవకాశం వచ్చినప్పుడు ఆ దర్శకుడికి ఫోన్‌ చేసి, సలహా అడిగాను. తన సినిమాని తిరస్కరించాననే కోపం ఏమాత్రం లేకుండా ఆయన చక్కని సలహా ఇచ్చారు. అందుకే బాలీవుడ్‌కన్నా నాకు టాలీవుడ్డే బెటర్‌ అనిపిస్తోంది' అన్నారు స్నేహా ఉల్లాల్‌.

 
 

Copy right reserved for www.cinevinodam.com 2005