క్లాసికల్ నాట్యం నేర్చుకున్న శోభనని డ్యాన్సింగ్ క్వీన్ అని కూడా అంటారు. నటిగా చిత్రాల్లో నటిస్తూనే నాట్య ప్రదర్శనలకూ ఎక్కువ సమయం ేకటారుుస్తున్నారు.
1994 కళార్పణ అనే డ్యాన్స్ స్కూల్‌ని చెన్నైలో ప్రారంభించి, ప్రతి ఏడాదీ డ్యాన్స్ ఫెస్టివల్స్‌ని భారతదేశంలోని ప్రముఖ నగరాల్లో నిర్వహిస్తుంటారామె.. ’చంబరి’్త
చిత్రంలో 1972లో నటిగా ెకరీర్ ప్రారంభించి, 1984లో ‘ఏప్రిల్ 18’ చిత్రంలో ఉత్తమ నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు.
పద్మశ్రీ అవార్డు గ్రహీత శోభన తన నాట్యప్రదర్శనల ద్వారా భారత ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లి మంచి పేరు తీసుకువస్తున్నారు. తెలుగుతోపాటు
మలయాళ, తమిళ, హిందీ చిత్రాల్లోనూ తన నటనతో అగ్రకథానాయికగా ముద్రవేసుకున్నారు. తమిళ సూపర్ స్టార్ హీరోగా నటించిన చంద్రముఖి చిత్రానికి మూలమైన
మలయాళ చిత్రంలో అద్భుతంగా నటించి అవార్డు కూడా కైవసం చేసుకున్న శోభన, కొంత కాలం పాటు నటనకు స్వస్తి చెప్పి డాన్స్ స్కూలు ప్రారం భించారు. ఎందరో
కళాకారులకు నాట్యం నేర్పుతున్న శోభన గ్లామర్ క్యారెక్టర్ కన్నా అభినయానికి ఆస్కారం ఉన్న పాత్రాలే ఎక్కువ చేశారు. శోభన అందం, అభినయం ఆమెకే సొంతం
అన్నట్లుండేవి. స్వతహాగా ఆమె క్లాసికల్ డాన్సర్...కాగా కమర్షియల్ చిత్రాల్లో ఇమడలేక శోభన తనకు తానుగా సినిమాల నుంచి రిటైర్మెంట్ తీసుకున్నారు.
ఆ తరవాత క్లాసికల్ డాన్స్‌కి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా 18 దేశాల్లో శోభన డాన్స్ స్కూల్ నిర్వహిస్తున్నారు. ఆమె అడపా దడపా
విదేశాలలోనూ నృత్య ప్రదర్శనలు ఇస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఆమె ఇచ్చిన ప్రదర్శనలు స్టేజి వరకే పరిమితమయ్యాయి. ఇప్పుడు ఆమె రామాయణం ఆధారం
చేసుకుని చేసిన నాట్యం ‘మాయ రావణ్’ పేరిట ఆంగ్లంలో రూపొందిన ఈ డీవీడీని కొంతకాలం క్రితం కమల్ హాసన్ ఆవిష్కరించారు. చెన్నైలో జరిగిన ఈ కార్యక్రమంలో
ఆయన మాట్లాడుతూ ‘బేసిక్‌గా నేను రావణాసురిడి అభిమానిని. ఆయన మాట్లాడుతూ వజ్రాలను తవ్వి తీసినట్లుగా మనలో ఉన్న ప్రతిభని వెలికి తీసుకోవాలి. అప్పుడే
వేలుగులోకి వస్తాం. శోభన వజ్రంలాంటిది’ అని చెప్పారు. 1980లలో భారతదేశంలో ప్రతిభావంతులైన కళాకారిణులలో ఈమెను ఒకరిగా చెప్పుకోవచ్చు. అందంలోను
నటనలోనే కాక నాట్యంలో కూడా ఆద్భుతంగా రాణిస్తున్న వ్యక్తి ఈమె. ఆమె చెన్నై లోని చిదంబరం నాట్య అకాడమీ లో శిక్షణ పొందారు. ఆమె గురువు పేరు చిత్రా
విశ్వేశ్వరన్ . భరత నాట్యంలో ఎంతో ముఖ్యమైన అభినయాన్ని ప్రదర్శించడంలో ఆమె దిట్ట. నేటి తరానికి చెందిన ఎందరో కళాకారిణులు ఈమె దగ్గర నటనలోను,
నాట్యంలోను శిక్షణ తీసుకుంటున్నారు.1994లో ఆమె కళార్పణ అనే సంస్థకు అంకురార్పణ చేశారు.. ఈ సంస్థ యొక్క ముఖ్యోద్దేశం భరతనాట్యంలో శిక్షణ,
భారతదేశమంతటా నృత్యవార్షికోత్సవాలు నిర్వహించడం.
పురస్కారాలు
1994లో విడుదలైన మణిచిత్రతళు అనే మళయాళ సినిమాకు గాను ఆమెకు భారత ప్రభుత్వం నుంచి తొలిసారిగా జాతీయ ఉత్తమ నటి పురస్కారం లభించింది.
తరువాత 2001 వ సంవత్సరంలో ప్రముఖ దక్షిణాది నటి రేవతి దర్శకత్వం వహించిన ‘మిత్ ...మై ఫ్రెండ్ ’ అనే ఆంగ్ల చిత్రానికి గాను రెండవసారి జాతీయ ఉత్తమ నటి
పురస్కారాన్ని అందుకున్నారు.