Bookmark and Share   Cinevinodam
Subscribe
 
 
తొలి ముద్దుకు సోనమ్ తయ్యార్

     ఇప్పటిదాకా కనిపించి కనిపించకుండా...చూపించి చూపించకుండా కుర్రకారును రెచ్చగొట్టిన సోనమ్‌కపూర్‌ తాను లేటెస్ట్‌గా చెల్లెలి నిర్మాణ సారధ్యంలో నటిస్తున్న ‘ఆయేషా’ చిత్రంలో తొలిసారిగా హీరో అభయ్‌డియోల్‌తో కలిసి ‘లిప్‌లాక్‌’ సన్నివేశంలో నటించబోతోందట. నిజానికి సోనమ్‌కు సినీరంగ ప్రవేశం తర్వాత ఇది తొలిముద్దుగా చెప్పవచ్చు. కాకపోతే చెల్లెలే దగ్గరుండి అక్కకు ముద్దు సీన్లలో తర్ఫీదునిస్తుందో లేక వేరే ఎవరితోనైనా షూట్‌ చేయిస్తుందో మరి. కాగా త్వరలో మంచి కథ దొరికితే దర్శకత్వం కూడా వహిస్తానంటోంది సోనమ్‌. గతంలోనూ సినిమా ఇండస్ట్రీలో సంచలనంగా చెప్పుకునే బికినీ డ్రెస్‌లమీద తన అభిప్రాయాన్ని నిస్సంకోచంగా చెప్పింది. ‘చాలా మంది హీరోయిన్లు తాము బికినీలలో నటించం...ఏదో తప్పనిసరిగా నటించాల్సివచ్చిందని ముద్దుముద్దుగా సమాధానాలు చెబుతుంటారు. అంతేకాదు బికినీ డ్రెస్‌ అందరి ముందు వేసుకోవడానికి తెగ సిగ్గుపడిపోయి మెలికలు తిరిగేస్తుంటారు.

షూటింగ్‌ గ్యాప్‌లో టవల్‌ కప్పుకుంటుంటారు...నేనైతే అలా చేయను. బికినీలో తప్పనిసరిగా నటించాల్సివస్తే కాదనను. అలాగని సిగ్గుతో మెలికలు తిరిగిపోను. బికినీ వేసుకోవడానికి ఒప్పుకున్నాక...ఇక అక్కడిదాకా వచ్చి అందాలను దాచుకోవడం...బిడియపడటం లాంటి పనులు నా దృష్టిలో సిల్లీగా ఉంటాయ్‌’ అంటోంది సోనమ్‌కపూర్‌.

 
 

Copy right reserved for www.cinevinodam.com 2005