డాసాయి రమేష్ గంధం సాహిత్య సృజన నుంచి రూపొందిన ఆల్బమ్ ‘శ్రీసాయి గానాంజలి’. సునీల్ కశ్యప్ సంగీతం అందించారు. మధుర శ్రీధర్ ఆల్బమ్ పర్యవేకుడు. మధుర ఆడియో ద్వారా పాటలు మార్కెట్లోకి విడుదల య్యాయి. తొలిసీడీని కాంగ్రెస్‌నేత వట్టి వసంతకుమార్ ఆవిష్కరించగా, డాసాయిరమేష్ గంధం అందుకున్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఆడియో వేడుకలో బెల్లంకొండ సురేష్, రమణ గోగుల, విజయచందర్, శోభ, ఎం.సుధాకర్‌బాబు, శివశంర్, పి.బి.రంగయ్య నాయుడు, శ్రీమతి శారద గంధం, మధుర శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
సాయిరమేష్ గంధం మాట్లాడుతూ ‘బాబా గొప్ప శక్తి. మనిషిలానే అన్ని ఉద్వేగాలూ ఉన్నా..ప్రేమ పాళ్లు ఎక్కువ. శత్రువుని కూడా ప్రేమించమని చెప్పారాయన. చిన్ననాటినుంచి తనకి భక్తుడిని. 50ఏళ్ల క్రితం రాసిన పాటలను ఇప్పుడు ఆడియోగా విడుదల చేస్తున్నాం. నా తొలి ఆల్బమ్ ‘శ్రీసాయి గీతాంజలి’ లానే ఈ ఆల్బమ్‌ను కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నా’ అన్నారు. సంగీతం ఇవ్వమని బాబా ఆజ్ఞ వేసినట్టుగా భావిస్తున్నానని సునీల్‌కశ్యప్ అన్నారు. దేశంలో తొలి షిరిడీ సాయి మందిరం కర్నూలులోనే వెలసిందని సుధాకర్‌బాబు తెలిపారు.
|