మనసులో ఉన్న దాన్ని సూటిగా చెప్పే వ్యక్తుల్లో బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్ ఒకరు. ఈయన
చేసే కామెంట్స్ బాలీవుడ్‌లో బాగా పండుతాయి. ఆనందం వచ్చినా, ఆక్రోషం వచ్చినా
ఆపుకోకుండా కక్కేయడం ఈ కండలవీరుడి తరహా. తోటి నటీనటుల చిత్రాలను మొహమాటం
లేకుండా విమర్శిస్తుంటారు. దీనివల్ల చాలామంది స్నేహితులు దూరం జరిగారు ! తాజాగా ఆ
జాబితాలో హృతిక్‌రోషన్ చేరాడు. వీటి గురించి సల్మాన్ ఏమంటున్నాడో విందా...
పెళ్లి చేసుకోవాలనుకుంటే, ఆ వేడుక గ్రాండ్‌గా జరపుతారా ? సాదాసీదాగా
కానిచ్చేస్తారా ?
ఆ రోజు పొద్దునే నిద్రలేస్తాను. పెళ్లి జరుగుతుంది. అంతే !
దబాంగ్ బిగ్ హిట్ కొట్టింది. నంబర్ వన్ స్థానం మీదేనా ?
కాదు.
మీ దృష్టిలో నంబర్‌వన్ ఎవరు ?
నేను మాత్రం కాదు. ఇంకొకరు ఉంటే,అదంత పట్టించుకునే విషయమే కాదు.
కత్రినాతో మీకున్న అనుబంధం..?
మిగతా ఆర్టిస్టులతో ఉన్నట్టుగానే..! సహజీవనం చేసానని మీకు చెప్పానా ! తర్వాత
విడిపోయామని అన్నానా ! అవేవీ లేనప్పుడు మీరడిగే దానిపై నేను చెప్పేది ఏముంటుంది !
ఫరాఖాన్‌తో మీరు చాలా ఫ్రెండ్లీగా ఉండటానికి కారణం...షారూక్-ఫరాఖాన్
మధ్య స్నేహం దెబ్బతినటమేనా ?
చాలాకాలం నుండే మేమిద్దరం స్నేహితులం. కానీ కలిసి పనిచేసింది తక్కువే. 'మైనే ప్యార్ కియా'
స్క్రీన్ టెస్ట్ సమయంలో...ఓ పాటకు కొరియోగ్రాఫ్ చేయమన్నా. నా నాట్య కౌశలం
చూసి...'ఇస్కా కుచ్ నహీ హో సక్తా హై' (ఇతడితో ఏమీ కాదు...) అని నా నుంచి దూరంగా
వెళ్లిపోయింది. మరో విషయం ఏమంటే...సజ్జిద్ నడియావాలా నా క్లోజ్ ఫ్రెండ్. అతను ఇప్పుడు
షారూక్‌తో సినిమా చేస్తున్నాడు. చేసే ముందు నాతోకూడా చెప్పాడు. 'గో హెడ్' అని చెప్పా.
మీరనుకున్న ఈక్వేషన్స్ మా మధ్య ఏవీ లేవు.
సల్మాన్‌తో జరిగిన ఘర్షణలో తనదే తప్పని షారూక్ అన్నారు. మీరేమంటారు
?
ఇంకా నేను చెప్పాల్సింది ఉందా !
ఉంది ?
వెల్..! అవును. కచ్చితంగా అతడు తప్పు చేశాడు.
'గుజారిష్' సినిమాపై మీరు చేసిన కామెంట్స్ హృతిక్, సంజయ్ లీలా
బన్సాలీని బాధపెట్టాయి. కదా !
నా చిత్రాల విషయంలోనూ అనేక తప్పులు వెదుకుతుంటాను. విమర్శలు చేస్తుంటాను.
ఖామోషీ, ఫిర్ మిలేంగే...చిత్రాలను కుక్కలు కూడా చూడవని కామెంట్ చేశా.
నన్నడిగితే...'గుజారిష్' లాంటి సినిమా చూసే సమయం ఇది కాదు. ఇక సందేశాల సంగతి.
సినిమాల ద్వారా సందేశాన్ని ఇవ్వటాన్ని నేనిష్టపడను. నిజానికి 'గుజారిష్'పై నేను అన్న
కామెంట్ కన్నా ముందే, ఎన్నో విమర్శలు వచ్చాయి.
మీ కామెంట్‌పై హృతిక్ కూడా స్పందించాడు...?
హృతిక్ చిన్న పిల్లాడు.