ఓవైపు వెండితెరపై రాణిస్తూనే.. వ్యాపారవేత్తగా కూడా సుస్మితాసేన్ తనదైన శైలిలో దూసుకుపోతోంది. ప్రస్తుతం
‘అయామ్ షీ’ అనే పేరుతో ఓ సంస్థను స్థాపించి.. గత ఏడాది నుండి భారతీయ మోడళ్ళకు శిక్షణనిచ్చి మిస్
యూనివర్స్ పోటీలకు పంపుతోంది. అంతకుముందు ఫెమినా మిస్ ఇండియా మిస్ యూనివర్స్ పోటీలకు
మోడళ్ళను సిద్ధం చేసే బాధ్యత నిర్వర్తించేంది. అయితే 2010 లో ఆ సంస్థ ఈ విధుల నుండి తప్పుకోవడంతో..
సుస్మితాసేన్ తన ‘అయామ్ షీ’ సంస్థ ద్వారా మోడళ్ళను అందాలపోటీలకు సిద్ధం చేస్తోంది. ‘‘అందాల పోటీల
విషయంలో భారతీయ మోడళ్లకు ఉన్న ఆలోచనా ధోరణి మారాలి.
కేవలం అందం, ఆకర్షణ ఉంటేనే సరిపోతుందనే ఆలోచన చాలామందిలో కనపడుతోంది. అది మారాలి.
బ్యూటీ కాంటెస్ట్ అంటే.. మేకప్‌తోనే ముగిసేది కాదు’’ అని అంటోంది సుస్మితాసేన్. రెనీ, అలిషా అనే ఇద్దరు
పిల్లను దత్తత తీసుకొని సాకుతున్న ఈ మాజీ విశ్వసుందరి.. తనకు పెళ్లి చేసుకోవాలనే ఆలోచన గానీ, అవసరం
గానీ ఏమీ రాలేదని చెబుతోంది. యాడ్ ఫిల్మ్ మేకర్ మానవ్ మీనన్, ప్రముఖ బాలీవుడ్ ఫిల్మ్ పర్సనాలిటీస్
రణ్‌దీప్ హుడా, విక్రమ్ భట్, సంజయ్ నారంగ్‌లతో డేటింగ్ చేసిన ఈ 35 ఏళ్ళ ముద్దుగుమ్మ పెళ్లి విషయం
గురించి అడిగినప్పుడు పై విధంగా స్పందించింది. ఇప్పటికే ఎన్నో సందర్భాల్లో వివాహం గురించి తన అభి
ప్రాయాన్ని కుండబద్దలు కొట్టిన సుస్మితా.. ఇప్పటికీ అదే అభి ప్రాయంతో ఉంది. ఒక వేళ తన అభిప్రాయం
మార్చుకున్నా.. ఈ వయసులో మళ్లీ అవ్వడం కష్టమే మరి!
|