విశ్వవిఖ్యాత నటచక్రవర్తి, సినీనటుడు ఎస్వీరంగారావు 38వ వర్థంతి సందర్భంగా ‘ఎస్వీరంగారావు విగ్రహ ప్రతిష్ట కమిటీ’ ఆధ్వర్యంలో విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటుచేసిన ఆయన కాంస్య విగ్రహాన్ని ప్రజారాజ్యంపార్టీ అధ్యక్షుడు, మెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరించారు. సినీనటులు కైకాల సత్యనారాయణ, తూర్పు జయప్రకాష్ రెడ్డి, విగ్రహ ప్రతిష్ట కమిటీ సభ్యులతో పాటు ప్రజారాజ్యం పార్టీ నాయకులు, కార్యకర్తలు, చిరంజీవి, ఎస్వీరంగారావు అభిమానుల కరతాళధ్వనుల మధ్య విగ్రహాన్ని చిరంజీవి ఆవిష్కరించి, గజమాలతో నివాళులర్పించారు.చిరంజీవిని చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు, ప్రజలు చేరుకోవడంతో కాసేపు తోపులాట జరిగింది.
అనంతరం చిరంజీవి మాట్లాడుతూ- ‘తెలుగు చలనచిత్రరంగంలో ఎప్పటికీ మరచిపోలేని పౌరాణిక, సాంఘిక ప్రాత్రలు పోషించిన మహానటుడు ఎస్వీరంగారావు ఓ నట గ్రంధమని, ఆయన్ను చూసే నేను నటన నేర్చుకున్నానని’చిరంజీవి కొనియాడారు. అనంతరం నటుడు కైకాల సత్యనారాయణను సన్మానించారు.
|