టీవి యాంకర్ గా వుంటూనే తనకంటూ ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్న స్వాతి, ఆ తర్వాత సినిమా రంగంలోనూ
తన సత్తాను చాటుకున్న విషయం తెలిసిందే. తెలుగు పరిశ్రమలోనే కాదు, తమిళ సినీ పరిశ్రమలోనూ స్వాతి
మంచి పేరే తెచ్చుకుంది. రెండు పరిశ్రమల్లోనూ తనకు మంచి అవకాశాలే వస్తున్నాయని మీడియా
ప్రతినిధులకు స్వాతి వెల్లడించింది. అయితే తనకు సరైన కథలు కావాలని స్వాతి అంటోంది. రొటీన్ సినిమాలు
తాను చేయలేనని ఈ ముద్దు గుమ్మ తెలిపింది. చాలామంది గ్లామరస్ పాత్రల్లో అవకాశాలు దక్కుతున్నా,
వాటిని అంగీకరించడంలేదని చెబుతోంది కలర్స్ స్వాతి.
‘అష్టాచెమ్మా’ ఘన విజయం సాధించినా, ‘కలవరమాయే మదిలో’ సినిమా కాస్తా బాక్సాఫీస్ వద్ద బోల్తా
కొట్టేయడంతో, ప్రస్తుతం డీలాపడ్డ స్వాతి మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. అలాగే తెలుగులో
మాత్రమే కాకుండా తమిళ, మలయాళ సినీ పరిశ్రమలో వెరైటీ అవకాశాల కోసం స్వాతి ఎదురుచూస్తోంది.
ఇప్పటికే తమిళంలో ‘సుబ్రమణీయపురం’ సినిమాతో హిట్ కొట్టిన స్వాతికి అక్కడి అవకాశాలు బాగానే
వున్నా... తన నచ్చిన కథకోసమే వస్తున్న గ్లామరస్ ఆఫర్లను తిరస్కరిస్తోందిట. ప్రస్తుతం ఆమె విక్రమ్ తో
సెల్వరాఘవన్ చిత్రంలో చేస్తోంది. అంతేకాకుండా సుమంత్ సరసన ఓ సినిమాలో హీరోయిన్ గా స్వాతి
ఎంపికైన విషయం తెలిసిందే. అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తో స్వాతి ‘ఎయిర్
టెల్’ ప్రకటనలో నటించింది.
|