మసాలా
 
 
 
 
'బాడ్ బోయ్స్' గుర్తింపు తెచ్చింది

నేను బ్యాడ్ బాయ్స్ నే కాదు గుడ్ బాయ్స్ ని కూడా ఇష్టపడతాను. హాట్ గా, బబ్లీగా, ఎక్కువ మాట్లాడుతూ ఉండటమంటే నాకిష్టం. అంటూందీ ఢిల్లీ బ్యూటీ శ్వేత భరద్వాజ్. ఇటీవలే బిజినెస్ మెన్ లో తను చేసిన ఐటమ్ సాంగ్ కు లభించిన స్పందన ఆనందంో మునిగిపోతుంది. బ్యాడ్ బాయ్స్ సాంగ్ ఇచ్చిన సక్సెస్ కి తన ఆనందాన్ని పాత్రికేయులతో పంచుకుంది.

మీకు ఈ ఆఫర్ ఎలా వచ్చింది?
మోడలింగ్ చేస్తున్న నన్ను పూరి జగన్నాథ్ సెలక్ట్ చేసి ఈ ఆఫర్ ఇచ్చారు.

పూరి, మహేష్ లతో వర్క్ ఎలా అనిపించింది?
మహేష్ వెరీ హాండ్ సమ్ హీరో కూల్ అండ్ క్వైట్. సెట్స్ లో ఎక్కువగా మాట్లాడడు. ఎలాంటి షాట్ నైనా ఒక టేక్ లో చేయగలడు.. అతని నటన నన్ను చాలా ఇంప్రెస్ చేసింది. అతనితో చేసింది ఒక సాంగే అయిన వెల్ ఎక్స్ పిరియన్స్ ని ఇచ్చింది. పూరి గుడ్ మూవీ మేకర్ ఈ సినిమా చాలా బాగా తీశాడు. నాకు ఇంకా ఇంకా ఈ సినిమా చూడాలనిపిస్తుంది.

కొరియో గ్రాఫర్ గురించి?
ఆమె చాలా స్ట్రిక్ట్ బట్ గుడ్ కొరియోగ్రాఫర్. ఆమెను చాలా కష్టపెట్టాను. కొంచెం కోపం కూడా ఎక్కువ ఆమెకి. ఈ సాంగ్స్ షూటింగ్ లో చాలా స్ట్రెస్ ని అనుభవించాను.

బ్యాడ్ బాయ్స్ సాంగ్ గురించి?
బ్యాడ్ బాయ్స్ సాంగ్ నాకు చాలా గుర్తింపు తెచ్చింది. సాంగ్ ట్రైలర్ రిలీజైన 5 రోజుల్లో 1 మిలియన్ వ్యూవర్స్ ఈ వీడియో సాంగ్ క్లిక్ చేయడం చాలా ఆనందంగా అనిపించింది. అలాగే ఈ సాంగ్ విడుదలైన తర్వాత మంచి ఆఫర్స్ వచ్చాయి. ట్విట్టర్ మరియు ఫేస్ బుక్ లో కమెంట్స్, కాంప్లీమెంట్స్ చాలా వచ్చాయి. చాలా హ్యాపీగా ఉంది.

మీ ప్రివియస్ ఎక్స్ పీరియన్స్ గురించి?
మోడల్ గా మంచి పేరు తెచ్చుకున్నాను. బ్యాడ్ బాయ్స్ సాంగ్ తో ఆ పేరు ఇంకా పెరిగింది.

తదుపరి చిత్రాలు ఏమైనా ప్లాన్ చేస్తున్నారా?
హిందీలో రెండు మూడు ఆఫర్స్ రెడీగా ఉన్నాయి. తెలుగులో కూడా సినిమాలు చేస్తాను. త్వరలోనే హైదరాబాద్ వచ్చేసే ప్లాన్ చేస్తున్నాను. ఇంకా రెండు నెలలో తెలుగు నేర్చుకుంటాను అని తెలిపారు. బిజినెస్ మెన్ తనకు మంచి పేరు తెచ్చిపెట్టిందని తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.