Bookmark and Share   Cinevinodam
Subscribe
 
 
షారూక్ తో బాలీవుడ్ లోకి...

     ముంబై నుండి దక్షిణాదికొచ్చి నటిగా నిరూపించుకున్న తర్వాత కొందరు తారలకు బాలీవుడ్ లో ఆదరణ లభిస్తోంది. అందులో జెనీలియా ఒకరు. ఇప్పుడు ‘హ్యాపీడేస్’ హీరోయిన్ తమన్నాకు కూడా బాలీవుడ్ నుండి పిలుపొచ్చింది. అయితే, అది అలాంటి ఇలాంటి పిలుపు కాదు... ఆ పిలుపు సాక్షాత్తూ బాలీవుడ్ బాదుషా షారుక్ ఖాన్ నుండి. గత ఏడాది శంకర్ నిర్మాతగా వచ్చిన ‘కల్లూరి’ విజయవంతమైంది.ఆ తర్వాత ‘జబ్ ఉయ్ మెట్’ ఆధారంగా నిర్మించిన ‘కండేన్ కాదలై’లో తమన్నా చేసింది. ఆ చిత్రాన్ని ఇటీవల షారుక్ ఖాన్ చూశారట. తమన్నా నటన అతనికి ఎంతగానో నచ్చింది. దాంతో, తను నటించే తదుపరి చిత్రంలో తమన్నాను హీరోయిన్ గా తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఫరా అక్తర్ దర్శకత్వంలో ఈ చిత్రం త్వరలో ప్రారంభం అవుతుంది. నటిగా ‘హ్యాపీడేస్’ తమన్నా కెరీర్ ని మలుపుతిప్పితే, ఇప్పుడు ‘కండేన్ కాదలై’ ఏకంగా బాలీవుడ్ కే దారిచూపింది. ఇప్పుడు అసిన్, జెనీలియా, త్రిషల బాటలో తమన్నా కూడా బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. తమన్నా తమిళంలో కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రంలో కమల్ హసన్ సరసన నటిస్తుండటం కూడా, ఆమె కెరీర్ లో మరో విశేషంగానే చెప్పుకోవాలి.

 
 

Copy right reserved for www.cinevinodam.com 2005