వ్యాపారానికి ప్రచారం చాలా అవసరం . ప్రచారంలో ఎన్నో ఎత్తుగడలు కనిపిస్తాయి. నాలుగురాళ్లు వెనుకేసుకుందామని తారలు
ఆరాటపడితే, ఆ తారల గ్లామర్‌తో వినియోగదారులను ఆకట్టుకుందామని వాణిజ్య సంస్థలు ఎదురుచూస్తుంటాయి. అయితేతారలకు లక్షల
రూపాయలను పారితోషకంగా చెల్లించాలి. అది మాత్రం ఎందుకివ్వాలి... అని చెన్నైలోని ఓ సబ్బుల కంపెనీ అనుకొంది. అంతే...
తమన్నా ఫోటోలను తమ సబ్బుల కంపెనీ ప్రచారం కోసం వాడుకునారు. . తమిళనాట ఏ గోడ చూసినా...తమన్నా పక్కన సబ్బు
బొమ్మ. దీంతో ఈ తెల్ల పిల్ల తెల్లమొహం వేసింది. నా అనుమతి లేకుండా నా ఫోటోలు వాడుకుంటారా ! అని కోర్టుకెక్కింది.
వాదోపవాదనలు విన్నాక సదురు కోర్టు తమన్నాకి కోట్ల రూపాయల్లో నష్టపరిహారం ఇవ్వాల్సిందేనని ఆ సబ్బుల కంపెనీని ఆదేశించింది.
'తమన్నా ఫోటో వాడుకోవటం వల్ల మా కంపెనీకి పెద్ద ఒరగింది ఏమీ లేదు. పైగా నష్టాలు పెరిగాయి. అన్ని కోట్లు ఇచ్చే స్థితిలో మేము
లేం. కావాలంటే మా కంపెనీ ఇచ్చేస్తాం. తీసుకోండి' అంటూ సమాధానమిచ్చారు. సబ్బుల కంపెనీ తీసుకుంటుందా!
ఎందుకొచ్చిన గొడవ అనుకుని ఊరుకుంటుందా! తమన్నాఇప్పుడు ఏం చేస్తుందో చూడాలి మరి!