Bookmark and Share   Cinevinodam
Subscribe
 
 
జ్యోతిష్కుడు చెప్పాడు!

     జ్యోతిషం, సంఖ్యాశాస్త్రం మీద నాకు విశ్వాసం వుంది. ఎందుకంటే, పద్దెనిమిదేళ్ళు నిండకుండానే నేను బోలెడంత డబ్బు సంపాయిస్తానని, నా చిన్నప్పుడే ఓ జ్యోతిష్కుడు చెప్పాడట. ఇప్పుడు అదే జరిగింది కదా! నా పేరు చివర TAMANNA (AH) ఎ.హెచ్. అదనంగా చేర్చుకున్న తర్వాతనే నాకు శేఖర్ కమ్ముల ‘హ్యాపీడేస్’లో అవకాశం వచ్చింది. ఆ తర్వాత నా దశ తిరిగింది. సూర్య, విజయ్ వంటి పెద్ద హీరోలతో చేసే అవకాశం కలిగింది- అంటూ తన నమ్మకాల గురించి చెబుతోంది తమన్నా.

- డాన్స్ చేయడం, పుస్తకాలు చదవడం నాకిష్టమైన అభిరుచులు. ఉత్తరాది అమ్మాయినే అయినా ఆహారం విషయంలో దక్షిణాది వంటలంటేనే బాగా ఇష్టం. నటీమణుల్లో మధురీదీక్షిత్, ప్రీతిజింటా, జ్యోతికలంటే ఇష్టం. హీరోల్లో హృతిక్ రోషన్ అంటే ఇష్టం.

- నేను స్కూల్లో చదువున్నపుడే ‘ఫెయిర్ అండ్ లవ్లీ’ యాడ్లో నటించే అవకాశం వచ్చింది. దాన్ని చూసి ‘శ్రీ’లో నన్ను తీసుకున్నారు.

- అందాన్ని, ఆరోగ్యాన్నీ ఎప్పుడూ కాపాడుకోలేకపోతే హీరోయిన్ గా ఎక్కువకాలం ఉండలేము. అందుకే రోజులో అరగంటయినా వ్యాయామం చేస్తాను. కుదరకపోతే అరగంటసేపు వేగంగా డాన్స్ చేస్తాను.

- తెలుగు, హిందీ, తమిళ సినిమాల్లోని మంచి పాటలన్నీ నా సెల్ ఫోన్లో దాచుకుని అదే పనిగా వింటుంటాను. అలా సేకరించిన హిట్ పాటలు కొన్ని వందలు నా దగ్గర వున్నాయి.

- ‘శ్రీ’ చేస్తున్నప్పుడు నాకు తెలుగురాక, చాలా ఇబ్బందిగా వుండేది. అలాగే తమిళ్ కూడా. అయితే, అప్పటినుండి పట్టుదలగా రెండు భాషలు నేర్చుకున్నాను. ఇప్పుడు బాగానే మాట్లాడుతున్నాను. చూస్తుండండి... త్వరలో నా పాత్రని నేనే డబ్బింగ్ చెప్పుకుంటాను.

- చిత్రరంగంలోకి అడుగుపెట్టినా చదువును నిర్లక్ష్యం చేయలేదు. సరైన వయసులోనే స్కూలు చదువు పూర్తి చేశాను. దూరవిద్యా విధానంలో ఎకనామిక్స్ లో డిగ్రీ చేశాను.

 
 

Copy right reserved for www.cinevinodam.com 2005