తమన్నా 'ప్రేమ'లో పడ్డారని తమిళనాడులో ఓ రూమరు షికారు చేస్తోంది.
తమన్నా 'ప్రేమ'లో పడ్డారని తమిళనాడులో ఓ రూమరు షికారు చేస్తోంది. ఆమె ప్రేమలో పడింది ఎవరితోనో కాదు..
తన సహనటుడు కార్తీతో అట. కార్తీ అంటే మనకు తెలిసిన హీరోనే. ప్రముఖ హీరో సూర్య సోదరుడుగా కూడా కార్తీ
సుపరిచితులు. కార్తీ-తమన్నాలు 'పయ్యా' చిత్రంలో కలిసి నటించారు. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రణయం
చోటుచేసుకుందట.
ఈ ఇద్దరూ ఇప్పుడు 'సిరుతాయ్' అనే చిత్రంలో కూడా కలిసి నటిస్తున్నారు. ఈ సినిమాలో తమన్నా చేయడానికి
కార్తీ సిఫార్సే కారణమని కూడా తమిళ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయాన్ని తమన్నా దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఆమె
మాత్రం అవి ఎలాంటి ఆధారం లేని వార్తలని కొట్టి పారేస్తున్నారు. "ఇలాంటి వదంతులు ఎలా పుడ్తున్నాయో నాకు అర్థం
కావడంలేదు. ఆఫ్‌కోర్స్.. ఈ పరిశ్రమలో ఇటువంటి రూమర్స్ చోటుచేసుకోవడం సహజం అనుకోండి.
ఎవరేం మాట్లాడుకున్నా ఇప్పుడు నా శ్రద్థ మొత్తం సినిమాల్లో నటనమీదనే. ప్రేమ-పెళ్లి గురించి ఇప్పుడు ఆలోచన లేదు.
ఇంకా చాలా సినిమాలు చేయాలి. మంచి మంచి పాత్రలు చేయాలి. పేరుతెచ్చుకోవాలి. అవార్డులు తెచ్చుకోవాలి. ఆ
తర్వాతనే పెళ్లికి సంసిద్థమవుతా' అన్నారు తమన్నా. ఈ మిల్కీ బ్యూటీ ఇప్పుడు తెలుగులో అల్లు అర్జున్ సరసన
'బద్రీనాథ్' చిత్రంలో నటిస్తున్నారు. వీవీ వినాయక్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.
|