Bookmark and Share   Cinevinodam
Subscribe
 
 
దక్షిణాది తారా సంగమం

     ‘‘సదరన్ స్టార్ ఎవర్ గ్రీన్ 80'స్ రియూనియన్’’ పేరుతో దక్షిణాదికి చెందిన ప్రముఖ నటీనటులు పలువురు ఇటీవల చెన్నైలో కలిసి ఆనందంగా ఓ సాయంత్రం గడిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ భార్య విజి, సుహాసిని మణిరత్నం నిర్వహించారు. ప్రతి ఏటా ఓ దక్షిణాది నగరంలో ఇలా కలవడం గత ఏడాది నుండి ప్రారంభించారు. 80 దశకంలో దక్షిణాది సినిమాను ఏలిన ప్రముఖ నటీనటులు పాల్గొన్న ఈ కార్యక్రమానికి కొందరు కొత్త తరం నటీనటులు కూడా హాజరై కనుల పండుగ చేశారు.

రజనీకాంత్, చిరంజీవి, మోహన్ లాల్, వెంకటేష్, శరత్ కుమార్, అర్జున్, మోహన్, కార్తీక్, ప్రభు, రాధిక, రాధ, శోభన, పూర్ణిమా భాగ్యరాజ్, కుష్బూ, అంబరీష్, సుమలత, భానుచందర్, సురేష్, సుమన్, నరేష్, అంబిక, నదియ, రమ్యకృష్ణ, శంకర్, ప్రతాప్ పోతన్, ముఖేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 
 

Copy right reserved for www.cinevinodam.com 2005